News October 9, 2025
శ్రీకాకుళం: రూ.40.23 కోట్లతో రోడ్ల అభివృద్ధి.!

శ్రీకాకుళం జిల్లాలో రూ.40.23 కోట్ల ఖర్చుతో రోడ్ల అభివృద్ధికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. జిల్లాలో 101.15 కిలోమీటర్ల మేర గుంతలు లేని రోడ్లు మరమ్మతులు కోసం ఈ నిధులు మంజూరు చేస్తూ బుధవారం ఉత్తర్వులు విడుదల చేసింది. దీంతో జిల్లాలోని ఆర్ అండ్ బి, ప్రధాన, జాతీయ రహదారులు అభివృద్ధి జరగనున్నాయి. ఆయా రోడ్డుల అభివృద్ధికి జిల్లా ఆర్ అండ్ బి అధికారులు పనులు చేపట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.
Similar News
News October 9, 2025
దుబాయ్‌లో మరణించిన సోంపేట మండల వాసి

సోంపేట మండలం పాలవలస గ్రామానికి చెందిన తామాడ ఓంకార్ (21) దుబాయ్‌లో అనుమానాస్పదంగా మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ప్రకారం.. 6 నెలలు క్రితం వలస కూలీగా దుబాయ్ వెళ్లిన ఓంకార్ ఈ నెల 3వ తేదీన మరణించినట్లు సహచర కార్మికులు ద్వారా తెలిసిందన్నారు. మృతదేహాన్ని గ్రామానికి రప్పించడానికి నాయకులు, అధికారులు సహకరించాలని కోరారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.
News October 9, 2025
గెస్ట్ లెక్చలర్ పోస్టుల దరఖాస్తుకు నేడే చివరి తేదీ

శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాలలో గెస్ట్ లెక్చరర్ల నియామకానికి గురువారంలోగా దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్ డా.కె.శ్రీరాములు ఒక ప్రకటనలో తెలిపారు. సంస్కృతం, ఒరియా సబ్జెక్టులకు గాను సంబంధిత సబ్జెక్టులలో పిజీతోపాటు PHD, నెట్, ఏపీసెట్ అర్హతలున్న అభ్యర్థులు అర్హులు అన్నారు. దరఖాస్తును కళాశాలో అందజేయాలన్నారు. ఈనెల 10వ తేదీ ఉదయం 10 గంటలకు ఇంటర్వ్యూ కళాశాలలో ఉంటుందన్నారు.
News October 9, 2025
ఎల్.ఎన్.పేట: ప్రమాదవశాత్తు రిజర్వాయర్‌లో పడి యువకుడు మృతి

ఎల్.ఎన్.పేట మండలం జంబాడ గ్రామానికి సమీపంలోని కడగండి రిజర్వాయర్లో నిమ్మక సతీష్ (23) ప్రమాదవశాత్తు పడి మృతి చెందాడు. బుధవారం సాయంత్రం రిజర్వాయర్ వద్దకు జంబాడ గ్రామానికి చెందిన నిమ్మక సతీష్, కొండగొర్రె లక్ష్మీనారాయణ, పాలక సతీష్ వెళ్లారు. రిజర్వాయర్ మదుము (కాన) వద్ద నిమ్మక సతీష్ దిగి మదములో పడిపోయాడు. ఆసుపత్రికి తరలించిగా పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు చెప్పారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.