News October 9, 2025
సిద్దిపేట: అత్యాచారం కేసులో నిందితుడికి యావజ్జీవ శిక్ష

అత్యాచారం, పెళ్లి చేసుకుంటానని ఓ ఉపాధ్యాయురాలిని మోసం చేసిన కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష, రూ.1.50 లక్షల జరిమానా విధిస్తూ సిద్దిపేట అడిషనల్ జడ్జి జయ ప్రసాద్ తీర్పు ఇచ్చారని సిద్దిపేట పోలీస్ కమిషనర్ విజయ్ కుమార్ తెలిపారు. బాధితురాలికి రూ.5 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని ప్రభుత్వానికి సిఫారసు చేశారని కమిషనర్ తెలిపారు.
Similar News
News October 9, 2025
వరంగల్: రూ.800 పెరిగిన వండర్ హట్ మిర్చి

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో గురువారం మిర్చి ధరల వివరాలు ఇలా ఉన్నాయి. బుధవారం తేజా మిర్చి(ఏసీ) క్వింటాకు రూ.14,700 ధర పలకగా.. ఈరోజు రూ.14,500కి తగ్గింది. 341 రకం మిర్చి(ఏసీ)కి నిన్న రూ.16,200 ధర వస్తే.. నేడు రూ.16,300 అయ్యింది. మరోవైపు వండర్ హాట్(WH) ఏసీ మిర్చికి బుధవారం రూ.16 వేలు ధర వస్తే.. గురువారం రూ.16,800 అయినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు.
News October 9, 2025
TRP ఉమ్మడి వరంగల్ జిల్లా కన్వీనర్‌గా రమణ

తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి 10 జిల్లాలకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ (TRP) సోషల్ మీడియా విభాగానికి కన్వీనర్లను నియమించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా కన్వీనర్‌గా భద్రకాళి రమణను ఎన్నుకున్నారు. ఈ మేరకు ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న, రాష్ట్ర కన్వీనర్ ఆకుల మనోజ్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నియామకం తక్షణమే అమలులోకి వస్తుందన్నారు.
News October 9, 2025
అడ్వాన్స్ టెక్నాలజీ కోర్సులను వినియోగించుకోవాలి: కలెక్టర్

సిద్దిపేట రూరల్ మండలం ఇర్కోడ్ గ్రామ పరిధిలో గల ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థను జిల్లా కలెక్టర్ హైమావతి సందర్శించారు. విద్యార్థులకు అందించే శిక్షణ తరగతులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రిన్సిపల్ రామానుజ, టీచర్స్ అందరితో సమావేశం నిర్వహించారు. యువతకు ఉపాధి అందించేందుకు అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లను ప్రారంభించి కొత్త కోర్సులను తీసుకు వచ్చినట్లు తెలిపారు. యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు.