News October 9, 2025

MBNR: మొదటి విడత ఎన్నికలు.. ఈ మండలాలలోనే!

image

జిల్లాలో తొలి విడత స్థానిక సంస్థల జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ నేటి నుంచి ప్రారంభమవుతుంది. గండీడ్, మహమ్మదాబాద్, మిడ్జిల్, నవాబుపేట, రాజాపూర్, జడ్చర్ల, భూత్‌పూర్, బాలానగర్ మండలాల్లో ఈ ఎన్నికలు జరగనున్నాయి. 8 జడ్పీటీసీ, 89 ఎంపీటీసీ స్థానాలకు దరఖాస్తులు స్వీకరిస్తారు. దీనికోసం జిల్లాలో 28 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.

Similar News

News October 9, 2025

MBNR: అసత్య ప్రచారాలపై కఠిన చర్యలు: ఎస్పీ

image

ఎన్నికల కోడ్‌ను జిల్లాలో పటిష్టంగా అమలు చేస్తున్నట్లు ఎస్పీ డి.జానకి వెల్లడించారు. ఎన్నికల సంఘం సూచనలు, నిబంధనల మేరకు వ్యవహరించాలని, శాంతి భద్రతలకు ఆటంకం కలిగించవద్దని ఆమె కోరారు. అనుమానాస్పద కార్యకలాపాలపై పోలీసు నిఘా ఉంటుందని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేసినా, ఇతరుల మనోభావాలను కించపరిచేలా పోస్ట్‌లు పెట్టినా కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు.

News October 9, 2025

MBNR: నామినేషన్ ప్రక్రియ.. పటిష్ట నిఘా: SP

image

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ ప్రక్రియ సందర్భంగా మహబూబ్‌నగర్ జిల్లాలో పటిష్ట నిఘా ఉంచినట్లు ఎస్పీ డి.జానకి తెలిపారు. జిల్లాలోని 16 మండలాల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్ కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఉంటుందని, డీఎస్పీలు, సీఐలు పర్యవేక్షిస్తారని చెప్పారు. కేంద్రాల వద్ద 100 మీటర్ల పరిధి నిబంధనలు ఉంటాయని, బారికేడ్లు ఏర్పాటు చేశామని ఆమె వివరించారు.
SHARE IT

News October 9, 2025

ఉడిత్యాలలో అత్యధిక వర్షపాతం

image

మహబూబ్‌నగర్ జిల్లాలో గడిచిన 24 గంటల్లో పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. బాలానగర్ మండలం ఉడిత్యాలలో 13.8 మి.మీ. అత్యధిక వర్షపాతం నమోదైంది. చిన్నచింతకుంట మండలం వడ్డేమాన్‌లో 8.5 మి.మీ., జడ్చర్లలో 6.5 మి.మీ., నవాబుపేటలో 3.5 మి.మీ., మిడ్జిల్‌లో 2.8 మి.మీ., కౌకుంట్ల 2.0 మి.మీ., చిన్నచింతకుంటలో 1.8 మి.మీ. వర్షం కురిసినట్లు అధికారులు తెలిపారు.