News October 9, 2025
BELలో 30 ఇంజినీర్ పోస్టులు

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(BEL)30 ఇంజినీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ, టెక్నీషియన్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు OCT 29 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి టెన్త్, ITI, డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 28ఏళ్లు. దరఖాస్తు ఫీజు రూ.590, SC, ST, PWDలకు ఫీజు నుంచి మినహాయింపు కలదు. రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://bel-india.in/
Similar News
News February 16, 2026
టెన్త్‌లో రెండు బోర్డు ఎగ్జామ్స్‌పై CBSE క్లారిటీ

పదో తరగతిలో రెండు బోర్డు ఎగ్జామ్‌ల పాలసీపై CBSE స్పష్టతనిచ్చింది. విద్యార్థులందరూ మొదటి బోర్డు పరీక్షలు రాయడం తప్పనిసరి అని పేర్కొంది. మొదటి బోర్డు పరీక్షల్లో 3 లేదా అంతకంటే ఎక్కువ సబ్జెక్టులకు హాజరు కాకపోతే రెండో బోర్డు పరీక్షలకు అనర్హులని తెలిపింది. ఇంప్రూవ్‌మెంట్, మొదటి బోర్డు పరీక్షల్లో ఫెయిలైన వారి కోసం మాత్రమే సెకండ్ బోర్డు ఎగ్జామ్స్ నిర్వహించనున్నట్లు వివరించింది.
News February 16, 2026
హంపి గ్యాంగ్ రేప్ కేసు.. ముగ్గురికి మరణశిక్ష

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హంపి (కర్ణాటక) గ్యాంగ్ రేప్ కేసులో గంగావతి కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ముగ్గురు దోషులు మల్లేశ్, సాయి, శరణప్పలకు మరణశిక్ష విధించింది. 2025 మార్చిలో తుంగభద్ర నదీతీరంలో ఓ విదేశీ (ఇజ్రాయెల్) మహిళతో పాటు మరో మహిళ (హోమ్ స్టే ఆపరేటర్)పై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితులతో ఉన్న ముగ్గురు స్నేహితులను నదిలోకి తోసేయడంతో ఒకరు చనిపోయారు.
News February 16, 2026
గర్భిణీలకు టిఫా స్కాన్ ఎందుకు?

టిఫా అంటే ‘టార్గెటెడ్ ఇమేజింగ్ ఫర్ ఫ్యూటల్ ఎనామిలీస్’. గర్భిణులకు 18-22 వారాల మధ్య ఈ స్కాన్ చేస్తారు. గర్భంలోని శిశువు తల నుంచి కాలిబొటన వేలు వరకు ప్రతి అవయవాన్ని పరిశీలిస్తారు. శిశువు, మాయ పొజిషన్, ఉమ్మనీరు ఎంత ఉంది అన్నవి ఇందులో గుర్తిస్తారు. ఈ స్కాన్ ద్వారా చిన్నారుల్లో ఏమైనా లోపాలు ఉంటే ముందే గుర్తించి అందుకు తగిన వైద్యం అందించి తల్లీబిడ్డలిద్దరూ ఆరోగ్యంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవచ్చు.


