News October 9, 2025
అమాయకుల చావుకు కారణం జగన్: పుల్లారావు

స్వప్రయోజనాలు, నీచ రాజకీయాల కోసం జగన్మోహన్ రెడ్డి అమాయకులను చంపేస్తుంటే ప్రభుత్వం ఊరుకోదని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు హెచ్చరించారు. ఆయన హయాంలో రాష్ట్రంలో కల్తీ మద్యాన్ని ఏరులై పారించారని మండిపడ్డారు. అమాయకుల చావులకు కారణమైన జగన్, తన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి మెడికల్ కాలేజీల నిర్మాణంపై విష ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.
Similar News
News October 9, 2025
రూ.12,50,000 ప్రశ్న.. జవాబు చెప్పండి!

కౌన్ బనేగా కరోడ్‌పతి ప్రోగ్రామ్‌లో హోస్ట్ అమితాబ్ బచ్చన్ రూ.12.50 లక్షలకు క్రికెట్‌కు సంబంధించిన ప్రశ్న అడిగారు.
Q: ఈ కింది క్రికెటర్లలో వన్డేల్లో 10వేలకు పైగా పరుగులు చేసినా టెస్టుల్లో చేయనిది ఎవరు?
A: జో రూట్ B: విరాట్ కోహ్లీ
C: స్టీవ్ స్మిత్ D: కేన్ విలియమ్సన్
> మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి.
News October 9, 2025
నెల్లూరు: పంట కాలువ ఆనవాళ్ళు ఎక్కడ?

గతంలో వేలాది ఎకరాలకు సాగునీటిని అందించిన పంట కాలువ నేడు ఆనవాళ్లు కోల్పోతుంది. స్వర్ణాల చెరువు నుంచి కుడితిపాలెం పంట కాలువకు అనుసంధానంగా ఈ కాలువ ఉండేదట. ప్రస్తుతం మూడోమైలు NH నుంచి కొత్తకాలువ-కోడూరుపాడు మీదుగా కుడితిపాలెం వరకు ఈ కాలువ వెళ్ళేది. కానీ కాలక్రమేణా దీనివెంట ఆక్రమణలు పెరిగడం, నగరం విస్తరించడంతో దీని గురించి పట్టించుకోలేదు. ఇరిగేషన్ శాఖ పర్యవేక్షణ లోపమే కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు.
News October 9, 2025
ప్రేమ భద్రంగా ఉండేందుకు తాళం వేసేవారు!

పారిస్‌లోని పాంట్ డెస్ ఆర్ట్స్ బ్రిడ్జిపై ప్రేమకు చిహ్నంగా తాళాలు వేసే సంప్రదాయం (గుళ్లలో ముడుపుల మాదిరిగా) ఉండేది. తమ ప్రేమ శాశ్వతం కావాలని కోరుకునే జంటలు ఇక్కడ లాక్ చేసి, కీలను సీన్ నదిలో పడేసేవారు. అయితే తాళాల బరువుతో వంతెన కూలిపోయే ప్రమాదం ఉందని పారిస్ ప్రభుత్వం అలర్ట్ అయింది. 2015లో తాళాలను తొలగించి, వాటి స్థానంలో గాజు ప్యానెళ్లను అమర్చింది. ప్రస్తుతం ఇక్కడ తాళాలు వేయడం పూర్తిగా నిషేధం.