News October 9, 2025

మంత్రాలతో మద్యం మాన్పిస్తానని పూజారి మోసం

image

పూజారి మాటలు నమ్మి అనంతపురం మహిళ రూ.3.50 లక్షలు మోసపోయింది. భర్తకు మద్యం మాన్పించడానికి పూజలు చేస్తానన్న వీడియోను ఆమె సోషల్ మీడియాలో చూసి పూజారి దుర్గాప్రసాదరావును సంప్రదించారు. పూజలు, మంత్రాలకు ₹3.50 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పడంతో నగలు తాకట్టు పెట్టి డబ్బు ఇచ్చారు. 10 నెలలు గడిచినా పూజలు చేయకపోవడంతో పూజారితో ఆమె గొడవకు దిగారు. స్థానికంగా ఇది రచ్చ కావడంతో డబ్బు వెనక్కి ఇస్తానని ఆయన హామీ ఇచ్చారు.

Similar News

News October 9, 2025

కల్వకుర్తిలో ఏసీటీ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్

image

కల్వకుర్తి పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ సెంటర్‌ను (ACT) కలెక్టర్ సంతోష్ గురువారం సందర్శించారు. సెంటర్‌లో ఏర్పాటు చేసిన సౌకర్యాలను ఆయన పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. సాంకేతిక విద్యలో నైపుణ్యం సాధించడం ద్వారా ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలో విస్తృత ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అన్నారు.

News October 9, 2025

HYD: మేడిపల్లిలో భూలోక వైకుంఠం

image

శ్మశానం. ఆ పేరు వినగానే ఒళ్లు గగుర్పొడుస్తుంది. కాలుతున్న శవాల కమరు వాసనతో భీతి గొలిపే వాతావరణం కనిపిస్తుంది. ఎటుచూసినా ముండ్ల పొదలు, సమాధులు, చెత్త, చీకటి, అస్తవ్యస్త మార్గంతో జనం వెనుకడుగేస్తారు. దీనికి భిన్నంగా HYD శివారు మేడిపల్లి శ్మశానానికి హైటెక్ సొబగులు అద్దారు. పచ్చిక బయళ్లు, ప్రకాశవంతమైన కాంతులతో మెరిసిపోతోంది. ఆప్తులను కోల్పోయిన వారి దుఃఖాన్ని దూరం చేస్తోంది. వారికి సాంత్వననిస్తోంది.

News October 9, 2025

రూ.12,50,000 ప్రశ్న.. జవాబు చెప్పండి!

image

కౌన్ బనేగా కరోడ్‌పతి ప్రోగ్రామ్‌లో హోస్ట్ అమితాబ్ బచ్చన్ రూ.12.50 లక్షలకు క్రికెట్‌కు సంబంధించిన ప్రశ్న అడిగారు.
Q: ఈ కింది క్రికెటర్లలో వన్డేల్లో 10వేలకు పైగా పరుగులు చేసినా టెస్టుల్లో చేయనిది ఎవరు?
A: జో రూట్ B: విరాట్ కోహ్లీ
C: స్టీవ్ స్మిత్ D: కేన్ విలియమ్సన్
> మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి.