News October 9, 2025
యూరియా కొరత నివారించేందుకు చర్యలు

రబీ వరి సాగులో యూరియా కొరతను నివారించేందుకు వ్యవసాయశాఖ చర్యలు చేపట్టింది. ఎకరాకు 3 బస్తాలకే పరిమితం చేసి, మొత్తం 94,383 టన్నుల అవసరాన్ని లెక్కగట్టింది. జిల్లాలో ప్రస్తుతం 6వేల టన్నుల నిల్వ ఉండగా, ఈ నెలాఖరుకు మరో 4వేల టన్నులు రానున్నాయి. రైతులు వ్యవసాయశాఖ ఇచ్చే ప్రత్యేక కార్డు ద్వారా మాత్రమే యూరియా పొందాలి. కార్డులో రైతు వివరాలు, భూమి విస్తీర్ణం, పంట వివరాలు ఉంటాయని జిల్లా వ్యవసాయాధికారిణి అన్నారు.
Similar News
News October 9, 2025
నెల్లూరు: పంట కాలువ ఆనవాళ్ళు ఎక్కడ?

గతంలో వేలాది ఎకరాలకు సాగునీటిని అందించిన పంట కాలువ నేడు ఆనవాళ్లు కోల్పోతుంది. స్వర్ణాల చెరువు నుంచి కుడితిపాలెం పంట కాలువకు అనుసంధానంగా ఈ కాలువ ఉండేదట. ప్రస్తుతం మూడోమైలు NH నుంచి కొత్తకాలువ-కోడూరుపాడు మీదుగా కుడితిపాలెం వరకు ఈ కాలువ వెళ్ళేది. కానీ కాలక్రమేణా దీనివెంట ఆక్రమణలు పెరిగడం, నగరం విస్తరించడంతో దీని గురించి పట్టించుకోలేదు. ఇరిగేషన్ శాఖ పర్యవేక్షణ లోపమే కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు.
News October 9, 2025
నాయుడుపేటలో ట్రైన్ కింద పడి ఇంటర్ విద్యార్థి మృతి

నాయుడుపేట రైల్వే స్టేషన్ వద్ద ఇంటర్ చదువుతున్న సంతోష్(17) ప్రమాదవశాత్తు ట్రైన్ కింద పడి మృతి చెందాడు. వరదయ్యపాలెంకు చెందిన సంతోష్ వెంకటాచలం వద్ద ఓ ప్రైవేట్ కాలేజీలో ఎంపీసీ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. దసరా సెలవులు ముగించుకొని తడ నుంచి వెంకటాచలానికి ఫ్రెండ్స్‌తో ట్రైన్‌లో బయలుదేరాడు. నాయుడుపేట వద్దకి వచ్చేసరికి అదుపుతప్పి ట్రైన్ కిందపడి మృతి చెందాడు.
News October 9, 2025
నెల్లూరు జిల్లాలో విస్తరిస్తున్న గంజాయి వ్యాపారం!

నెల్లూరు జిల్లాలో గంజాయి, మాదకద్రవ్యాల వ్యాపారం ఆగడం లేదు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈగల్ బృందం ఉన్నప్పటికీ పరిస్థితి యథాతథంగా ఉంది. యువత, విద్యార్థులే ప్రధాన లక్ష్యంగా మారి గంజాయి వ్యాపారం విస్తరిస్తోంది. విశాఖ నుంచి దిగుమతి చేసే గంజాయిని చిన్న ప్యాకెట్లుగా చేసి కళాశాలలు, బస్టాండ్లు, థియేటర్లు, కేఫేల్లో విక్రయిస్తున్నారు. మొదట ఉచితంగా ఇచ్చి తర్వాత అధిక ధరలకు విక్రయిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి.