News October 9, 2025
10న వెంకటాచలం రానున్న CM..

CM చంద్రబాబు ఈ నెల 10న వెంకటాచలం మండలంలో పర్యటించనున్నారు. ఈదగాలి గ్రామంలోని విశ్వసముద్ర బయో ఇథనాల్ ప్లాంట్‌ను ఆయన ప్రారంభించనున్నారు. ఈ మేరకు బుధవారం కలెక్టర్ హిమాన్షు శుక్లా, ఎస్పీ అజిత వేజెండ్ల ఏర్పాట్లను పరిశీలించారు. సర్వేపల్లి బిట్ 2 గ్రామంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ ప్రాంతం, నందగోకులం లైఫ్ స్కూల్, గోశాల, విశ్వసముద్ర బయో ఇథనాల్ ప్లాంట్ పరిసరాలను వారు ముమ్మరంగా తనిఖీ చేశారు.
Similar News
News October 9, 2025
CM చంద్రబాబు పర్యటనపై కొనసాగుతున్న సందిగ్ధత.?

CM చంద్రబాబు శుక్రవారం నెల్లూరు జిల్లాలో పర్యటించాల్సి ఉంది. సర్వేపల్లి నియోజకవర్గంలోపాటు సిటీ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన ప్రారంభోత్సవాలు చెయ్యాలి. ఈ క్రమంలో జిల్లా అధికారులు హెలిపాడ్‌ను సైతం సిద్ధం చేశారు. అయితే ఇంతవరకు సీఎం పర్యటన అధికారకంగా ఖరారు కాలేదు. నెల్లూరులో అడపదడప కురుస్తున్న వర్షాల నేపథ్యంలో చంద్రబాబు పర్యటనపై ఉత్కంఠ నెలకొంది.
News October 9, 2025
నెల్లూరు: పంట కాలువ ఆనవాళ్ళు ఎక్కడ?

గతంలో వేలాది ఎకరాలకు సాగునీటిని అందించిన పంట కాలువ నేడు ఆనవాళ్లు కోల్పోతుంది. స్వర్ణాల చెరువు నుంచి కుడితిపాలెం పంట కాలువకు అనుసంధానంగా ఈ కాలువ ఉండేదట. ప్రస్తుతం మూడోమైలు NH నుంచి కొత్తకాలువ-కోడూరుపాడు మీదుగా కుడితిపాలెం వరకు ఈ కాలువ వెళ్ళేది. కానీ కాలక్రమేణా దీనివెంట ఆక్రమణలు పెరిగడం, నగరం విస్తరించడంతో దీని గురించి పట్టించుకోలేదు. ఇరిగేషన్ శాఖ పర్యవేక్షణ లోపమే కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు.
News October 9, 2025
నాయుడుపేటలో ట్రైన్ కింద పడి ఇంటర్ విద్యార్థి మృతి

నాయుడుపేట రైల్వే స్టేషన్ వద్ద ఇంటర్ చదువుతున్న సంతోష్(17) ప్రమాదవశాత్తు ట్రైన్ కింద పడి మృతి చెందాడు. వరదయ్యపాలెంకు చెందిన సంతోష్ వెంకటాచలం వద్ద ఓ ప్రైవేట్ కాలేజీలో ఎంపీసీ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. దసరా సెలవులు ముగించుకొని తడ నుంచి వెంకటాచలానికి ఫ్రెండ్స్‌తో ట్రైన్‌లో బయలుదేరాడు. నాయుడుపేట వద్దకి వచ్చేసరికి అదుపుతప్పి ట్రైన్ కిందపడి మృతి చెందాడు.