News October 9, 2025

మంచి భార్య రావాలనే వ్రతాలు ఉండవా?

image

మంచి భర్తను పొందడానికి అమ్మాయిలు అనేక వ్రతాలు ఆచరిస్తారు. కానీ సుగుణ సతీమణిని పొందడానికి అబ్బాయిలకు ఏ దివ్యమార్గం లేదా అనే సందేహం చాలామందిలో కలుగుతుంది. అయితే దీనికి పరిష్కారం ఉందని పండితులు చెబుతున్నారు. మంచి భార్య లభించాలని కోరుకునే పురుషులు దుర్గా దేవిని ప్రార్థించాలని సూచిస్తున్నారు. నిత్యం ‘పత్నీం మనోరమాం దేహి’ అనే మంత్రాన్ని పఠిస్తే.. సద్గుణాలు గల అమ్మాయి ధర్మపత్నిగా వస్తుందని అంటున్నారు.

Similar News

News October 9, 2025

ప్రెగ్నెన్సీలో కాల్షియం లోపం..

image

ప్రెగ్నెన్సీలో కాల్షియం కీలకపాత్ర పోషిస్తుందంటున్నారు నిపుణులు. శిశువు ఎముకలు, దంతాలు అభివృద్ధి చెందడానికి కాల్షియం ఎంతో అవసరం. శిశువుకు కాల్షియం తల్లి నుంచి లభిస్తుంది. తల్లికి కాల్షియం లోపం ఉంటే పుట్టబోయే బిడ్డపై ఆ ప్రభావం పడుతుంది. శిశువు గుండె, కండరాలతో పాటు నరాల అభివృద్ధిపైనా ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. కాబట్టి ఆహారంలో సోయా, చియా సీడ్స్, బీన్స్, బెండకాయలు చేర్చుకోవాలని సూచిస్తున్నారు.

News October 9, 2025

రూ.12,50,000 ప్రశ్న.. జవాబు చెప్పండి!

image

కౌన్ బనేగా కరోడ్‌పతి ప్రోగ్రామ్‌లో హోస్ట్ అమితాబ్ బచ్చన్ రూ.12.50 లక్షలకు క్రికెట్‌కు సంబంధించిన ప్రశ్న అడిగారు.
Q: ఈ కింది క్రికెటర్లలో వన్డేల్లో 10వేలకు పైగా పరుగులు చేసినా టెస్టుల్లో చేయనిది ఎవరు?
A: జో రూట్ B: విరాట్ కోహ్లీ
C: స్టీవ్ స్మిత్ D: కేన్ విలియమ్సన్
> మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి.

News October 9, 2025

ప్రేమ భద్రంగా ఉండేందుకు తాళం వేసేవారు!

image

పారిస్‌లోని పాంట్ డెస్ ఆర్ట్స్ బ్రిడ్జిపై ప్రేమకు చిహ్నంగా తాళాలు వేసే సంప్రదాయం (గుళ్లలో ముడుపుల మాదిరిగా) ఉండేది. తమ ప్రేమ శాశ్వతం కావాలని కోరుకునే జంటలు ఇక్కడ లాక్ చేసి, కీలను సీన్ నదిలో పడేసేవారు. అయితే తాళాల బరువుతో వంతెన కూలిపోయే ప్రమాదం ఉందని పారిస్ ప్రభుత్వం అలర్ట్ అయింది. 2015లో తాళాలను తొలగించి, వాటి స్థానంలో గాజు ప్యానెళ్లను అమర్చింది. ప్రస్తుతం ఇక్కడ తాళాలు వేయడం పూర్తిగా నిషేధం.