News October 9, 2025
భద్రాద్రి: నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ

స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ గురువారం నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 11వ తేదీ వరకు రోజూ ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ జరుగుతుందని కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. 12న పరిశీలన, 13న అభ్యంతరాల స్వీకరణ, 15న మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉందన్నారు. ఆ తర్వాత అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తామని పేర్కొన్నారు.
Similar News
News October 9, 2025
నకిలీ మద్యం కేసును రాజకీయం చేస్తున్నారు: కొల్లు

AP: నకిలీ మద్యం కేసుపై ప్రభుత్వం సీరియస్‌గా ఉందని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ‘తెనాలి వాసి కొడాలి శ్రీనివాస్, జయచంద్రారెడ్డి అనే వ్యక్తులకు నకిలీ మద్యంతో సంబంధముంది. ఇబ్రహీంపట్నంకు చెందిన జగన్మోహన్‌రావును పట్టుకున్నాం. ఈ అంశాన్ని ప్రతిపక్షం రాజకీయం చేయడం దారుణం. TDPకి చెందిన జయచంద్రారెడ్డిపై వెంటనే చర్యలు చేపట్టాం కానీ YCP నేత శ్రీనివాస్‌పై ఆ పార్టీ చర్యలు తీసుకోలేదు’ అని మండిపడ్డారు.
News October 9, 2025
మోస్రా: నామినేషన్ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలి: కలెక్టర్

మోస్రాలోని మండల కాంప్లెక్స్ భవనంలో ఏర్పాటు చేసిన స్థానిక సంస్థల ఎన్నికల నియమావళిని కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి గురువారం పరిశీలించారు. నామినేషన్‌లకు సంబంధించిన ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ రాజశేఖర్, ఎంపీడీఓ శ్రీనివాస్, ఎలక్షన్ అధికారులు రతన్, రవీందర్, అంబర్ సింగ్ పాల్గొన్నారు.
News October 9, 2025
BPCL రిఫైనరీ కోసం 6వేల ఎకరాలు

AP: NLR(D) రామాయపట్నం వద్ద BPCL సంస్థకు ప్రభుత్వం 6వేల ఎకరాలు కేటాయిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. కేపిటల్ వ్యయంలో 75% (₹96000 కోట్లు) ఆర్థిక ప్రోత్సాహకాల కింద 20 ఏళ్లలో అందించడానికి సూత్రప్రాయంగా అంగీకరించింది. ఈ భూముల్లో ₹1లక్ష కోట్లతో ఆ సంస్థ గ్రీన్ రిఫైనరీ కమ్ పెట్రోకెమికల్ కాంప్లెక్సును ఏర్పాటుచేస్తుంది. ఈ FYలో ₹4,843కోట్లు, తర్వాత వరుసగా 5 ఏళ్లలో ₹96,862 కోట్లు BPCL పెట్టుబడిగా వెచ్చించనుంది.