News October 9, 2025
వచ్చే డీఎస్సీలో 1,803 పీఈటీ, 261 HM పోస్టుల భర్తీ!

TG: ప్రభుత్వ బడుల్లో విద్యార్థులకు క్రీడల్లో శిక్షణ ఇచ్చేందుకు పీఈటీ ఉండాలన్న CM రేవంత్ ఆదేశాలతో అధికారులు చర్యలకు దిగారు. మొత్తం 4,641 హైస్కూళ్లలో 2,800కు పైగా పాఠశాలల్లో పీఈటీలు ఉన్నారు. దీంతో కొత్తగా 1,803 పోస్టులు భర్తీ చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. అటు కొత్త స్కూళ్లలో 261 హెడ్‌మాస్టర్ పోస్టులు భర్తీకి ప్రపోజల్ చేశారు. వీటిని వచ్చే DSCలో భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
Similar News
News October 9, 2025
ఫింగర్‌ప్రింట్ ద్వారా UPI పేమెంట్స్.. ఎలా చేయాలంటే?

UPI చెల్లింపుల కోసం PINకు <<17940744>>బదులు <<>>ఫింగర్‌ప్రింట్స్ & ఫేస్ రికగ్నిషన్ వాడటం ఆప్షన్ మాత్రమేనని నిపుణులు చెబుతున్నారు. ఇది అన్ని UPI యాప్‌లలోకి (Google Pay, PhonePe, Paytm), బ్యాంకులకు దశలవారీగా అందుబాటులోకి వస్తుంది. UPI యాప్ సెట్టింగ్స్‌లో ‘Biometric Authentication’ ఆప్షన్‌ను ‘Enable’ చేయండి. biometricsకు లింక్ చేయాలి. అంతే.. PIN, బయోమెట్రిక్ అథెంటికేషన్ ద్వారా పేమెంట్ చేయొచ్చు.
News October 9, 2025
ఇంటి చిట్కాలు

* కిటికీ అద్దాలు, డ్రెస్సింగ్ టేబుల్ మిర్రర్ కొన్నిసార్లు మబ్బుగా కనిపిస్తుంటుంది. అప్పుడు కాఫీ వడబోసే ఫిల్టర్ క్లాత్/ఫిల్టర్ పేపర్‌తో వాటిని శుభ్రం చేస్తే అవి తళతళా మెరిసిపోతాయి.
* గాజు వస్తువులు పగిలినప్పుడు, చీపురుతో శుభ్రం చేసినా కంటికి కనిపించని చిన్న చిన్న ముక్కలు ఉండిపోతాయి. అప్పుడు చిన్న బ్రెడ్ ముక్కను తీసుకొని.. ఆ ప్రదేశంలో నేలపై అద్దితే ఆ ముక్కలన్నీ శుభ్రమవుతాయి.
News October 9, 2025
రిజర్వేషన్లపై విచారణ ప్రారంభం

TG: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ తెచ్చిన జీవోపై హైకోర్టులో విచారణ పునఃప్రారంభమైంది. నిన్న జరిగిన విచారణలో ప్రభుత్వ, పిటిషనర్ల వాదనలు విని కోర్టు కొన్ని ప్రశ్నలు వేసింది. ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయలేదు. ఈ క్రమంలో ఇవాళ జరిగే విచారణపై ఉత్కంఠ నెలకొంది. అటు MPTC, ZPTCల తొలి విడత ఎన్నికలకు ఉదయం నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది.