News October 9, 2025
వరంగల్: ఆన్ లైన్ స్నేహలతో జర భద్రం

ఆన్ లైన్ స్నేహలతో జర భద్రమని వరంగల్ సైబర్ పోలీసులు తెలిపారు. అందరిని నమ్మొద్దని, ఆన్ లైన్ పరిచయాలతో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. చాటింగ్, ప్రొఫైల్ ఫోటో చూసి నమ్మొద్దన్నారు. తెలియని వారికి మీ ఫోటోలు పంపించవద్దని, పిల్లలకు ఆన్లైన్ మోసాలపై అవగాహనా కల్పించాలని సైబర్ పోలీసులు పేర్కొన్నారు.
Similar News
News October 9, 2025
గుత్తి విద్యార్థికి రూ.51లక్షల ప్యాకేజీతో ఉద్యోగం

గుత్తి పట్టణానికి చెందిన షేక్ బాషా, షేక్ రహమత్ బీ దంపతుల కుమారుడు షేక్ దాదా కలందర్ హైదరాబాదులోని బిట్స్ పిలానీ కళాశాలలో బీటెక్ సెకండియర్ చదువుతున్నారు. గత నెల 26న కళాశాలలో జరిగిన క్యాంపస్ ఇంటర్వ్యూలో అత్యంత ప్రతిభ కనబరిచి ఏడాదికి రూ.51 లక్షల ప్యాకేజీతో AMD కంపెనీలో ఉద్యోగానికి ఎంపికయ్యారు. బీటెక్ అయిపోగానే జాబ్‌లో చేరనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కలందర్‌ను తోటి విద్యార్థులు అభినందించారు.
News October 9, 2025
రేపటి నుంచి వైద్య సేవలు బంద్

ఏపీలో ఎన్టీఆర్ వైద్య సేవలు మరోసారి నిలిచిపోనున్నాయి. ప్రభుత్వం బకాయిలు విడుదల చేయకపోవడంతో రేపటి నుంచి సేవలు నిలిపివేస్తున్నట్లు నెట్‌వర్క్ ఆసుపత్రులు తెలిపాయి. ప్రభుత్వం నుంచి రూ.2,700 కోట్లు రావాలని పేర్కొన్నాయి. గత రెండు రోజులుగా ప్రజాప్రతినిధులను కలిశామని వెల్లడించాయి. తమ ఆందోళన కారణంగా సామాన్యులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వానికి విన్నవిస్తున్నట్లు తెలిపాయి.
News October 9, 2025
నేరాల కట్టడికి పటిష్టమైన చర్యలు చేపట్టాలి: ఎస్పీ

నేరాలు జరగకుండా పటిష్టమైన గస్తీ చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పోలీసులకు సూచించారు. గురువారం ఆయన మావల పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసి, సిబ్బంది విధులను, ఫిర్యాదుదారుల పట్ల వ్యవహరిస్తున్న తీరును పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ జీవన్ రెడ్డి, సీఐ కర్ర స్వామి సహా ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.