News October 9, 2025

ఖమ్మం: కలప అక్రమ రవాణా ఇంటి దొంగల పనేనా?

image

ఖమ్మం జిల్లా అటవీ శాఖలో అక్రమ కలప రవాణా కలకలం రేపింది. అధికారుల అనుమతి లేకుండానే సండ్ర అడవి దాటిపోవడంలో ఇంటి దొంగల ప్రమేయం ఉందని ఉన్నతాధికారులు తేల్చారు. చింతకాని(M) నుంచి తరలించిన కలపకు ఫీల్డ్ వెరిఫికేషన్, వాల్టా ఫీజు లేకుండానే NOC జారీ చేసినట్లు దర్యాప్తులో గుర్తించారు. ఈఘటనపై DFO సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ నేతృత్వంలో దర్యాప్తు జరుగుతోంది. ఇప్పటికే చింతకాని ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌ను సస్పెండ్ చేశారు.

Similar News

News October 9, 2025

నరసరావుపేట: ’22A’ భూములపై కలెక్టర్ సమీక్ష

image

పల్నాడు కలెక్టర్ కృతికా శుక్లా గురువారం కలెక్టర్ కార్యాలయంలో సెక్షన్ 22A కింద ఉన్న భూములపై సమీక్ష నిర్వహించారు. భూముల కేటాయింపు, హక్కుల గుర్తింపు, పత్రాల పరిశీలన, భూ వివాదాల పరిష్కారం వంటి అంశాలపై కలెక్టర్ చర్చించారు. భూ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ నిబంధనలు అనుసరిస్తూ అధికారులు బాధ్యతాయుతంగా, అప్రమత్తంగా వ్యవహరించాలని కలెక్టర్ సూచించారు.

News October 9, 2025

సిద్దిపేట: లైసెన్సుడ్ తుపాకులు అప్పగించాలి: సీపీ

image

ఎంపీటీసీ, జడ్పీటీసీ, గ్రామపంచాయతీ ఎన్నికల(స్థానిక సంస్థల ఎలక్షన్స్) కోడ్ అమల్లోకి వచ్చినందున లైసెన్స్ ఉన్న తుపాకులను స్థానిక పోలీస్ స్టేషన్లలో అప్పగించాలని సిద్ధిపేట పోలీస్ కమిషనర్ విజయ్ కుమార్ సూచించారు. లైసెన్స్ ఉన్న తుపాకులను వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో ఈ నెల 11 లోపు డిపాజిట్ చేయాలని, ఎన్నికల కోడ్ పూర్తయిన తర్వాత తిరిగి నిబంధనల ప్రకారం తీసుకొని వెళ్లవచ్చని తెలిపారు.

News October 9, 2025

నామినేషన్ ప్రక్రియ సజావుగా జరగాలి: జనగామ కలెక్టర్

image

నామినేషన్ ప్రక్రియ సజావుగా జరగాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. గురువారం జడ్పీ కార్యాలయాన్ని, లింగాల ఘనపూర్ ఎంపీడీఓ కార్యాలయాన్ని కలెక్టర్ సందర్శించారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. ఎలాంటి పొరపాట్లు జరగకుండా నామినేషన్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.