News October 9, 2025

MHBD: నేటి నుంచి ఎన్నికల నామినేషన్లు

image

మహబూబాబాద్ జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ మొదటి విడత ఎన్నికలు జరిగే మండలాల వివరాలు ఇలా ఉన్నాయి. బయ్యారం, చిన్న గూడూరు, దంతాలపల్లి, గార్ల, గూడూరు, మహబూబాబాద్, నరసింహాలపేట, పెద్ద వంగర, తొర్రూరు, మండలాలకు మొదటి విడతలో ఎన్నికలు జరగనున్నాయి. నేటి నుంచి అధికారులు MPDO కార్యాలయంలో నామినేషన్లను స్వీకరించనున్నారు. అక్టోబర్ 23న ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్ జరగనుంది.

Similar News

News October 9, 2025

గడువులోపు ఆమోదం తెలపకపోతే చట్టంగా భావిస్తాం: ఏజీ

image

TG: బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై విచారణలో ప్రభుత్వం బలంగా వాదనలు వినిపిస్తోంది. ఈ బిల్లును గవర్నర్, రాష్ట్రపతికి పంపినా ఆమోదం తెలపలేదని AG సుదర్శన్ రెడ్డి HCకి గుర్తు చేశారు. దీంతో తమిళనాడు కేసును ఉదాహరణగా పేర్కొంటూ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం బీసీ బిల్లు ఆమోదం పొందినట్లేనని స్పష్టం చేశారు. గవర్నర్/రాష్ట్రపతి గడువులోపు బిల్లును ఆమోదించకపోతే చట్టంగా భావించాల్సి ఉంటుందన్నారు.

News October 9, 2025

వరంగల్: తగ్గిన చిరుధాన్యాల ధరలు

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో గురువారం చిరుధాన్యాలు ధరలు ఇలా ఉన్నాయి. క్వింటా మక్కలు(బిల్టీ) నిన్న రూ.2,140 ధర పలకగా.. ఈరోజు రూ.2,130 చేరింది. సూక పల్లికాయకు నిన్న రూ.6,610 ధర రాగా.. గురువారం రూ.6,500 వచ్చింది. పచ్చి పల్లికాయకు బుధవారం రూ.4,100 ధర పలకగా.. ఈరోజు రూ.4వేలు అయినట్లు మార్కెట్ వ్యాపారులు తెలిపారు.

News October 9, 2025

వరంగల్: ప్రజలకు సమాచార అస్త్రం ఆర్టీఐ: డీఐఈఓ

image

ఆర్టీఐ ద్వారా సుపరిపాలన అనే అంశంపై వరంగల్ జిల్లాలోని అన్ని జూనియర్ కళాశాలల్లో సమాచార హక్కు చట్టం-2005పై వ్యాసరచన పోటీలను నిర్వహించారు. రంగశాయిపేట, కృష్ణాకాలనీ ప్రభుత్వ జూనియర్ కళాశాలలను DIEO శ్రీధర్ సుమన్ సందర్శించి విద్యార్థులకు బహుమతులను అందించారు. సమాచార హక్కు చట్టం-2005 ప్రజలకు సమాచారాన్ని పొందడంలో అస్త్రంగా ఉపయోగపడుతుందన్నారు.