News October 9, 2025
దీపావళి ఏ రోజు జరుపుకోవాలంటే?

అక్టోబర్ 20, 21 తేదీల్లో అమావాస్య తిథి ఉండటంతో.. ఈ ఏడాది దీపావళి ఏ రోజు జరుపుకోవాలన్న గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రముఖ పండితుల సంస్థ ‘కాశీ విద్వత్ పరిషత్’ దీనిపై క్లారిటీ ఇచ్చింది. దీపావళి పండుగను అక్టోబర్ 20వ తేదీన జరుపుకోవాలని స్పష్టం చేసింది. పూర్తి ప్రదోషకాలం (5.46 PM-8.18 PM)ఆరోజు ఉంటుందని వెల్లడించింది. లక్ష్మీపూజ కూడా అదే రోజు రా.7.08-రా.8.18 మధ్య జరుపుకోవచ్చని తెలిపింది.
Similar News
News October 9, 2025
కోనసీమ దుర్ఘటన.. విచారణకు ఉన్నతస్థాయి కమిటీ

AP: కోనసీమ(D) రాయవరంలో బాణసంచా పేలి 8 మంది సజీవదహనమైన విషయం తెలిసిందే. ఈ ఘటనపై దర్యాప్తునకు మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్‌కుమార్ నేతృత్వంలో ప్రభుత్వం ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. పేలుడుకు గల కారణాలు, బాధ్యులను గుర్తించాలని ఆదేశించింది. విచారణ అధ్యయన నివేదికను వారంలోగా సమర్పించాలని ఆదేశించింది.
News October 9, 2025
దేశంలో నం.1 కుబేరుడిగా ముకేశ్ అంబానీ

దేశంలో టాప్-100 కుబేరుల జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ మరోసారి అగ్రస్థానంలో నిలిచినట్లు ఫోర్బ్స్ వెల్లడించింది. ప్రస్తుతం ఆయన సంపద 105బి. డాలర్లుగా ఉండగా గత ఏడాదితో పోలిస్తే 12శాతం తగ్గింది. రెండో స్థానంలో 92బి. డాలర్ల ఆదాయంతో గౌతమ్ ఆదానీ ఉన్నారు. సావిత్రి జిందాల్(ఓపీ జిందాల్ గ్రూప్), టెలికాం దిగ్గజం సునీల్ మిత్తల్, టెక్ బిలియనీర్ శివ నాడార్ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
News October 9, 2025
భైరవుడి ఆవిర్భావం: శివుని శక్తి స్వరూపం

సత్యానికి విరుద్ధంగా మాట్లాడిన బ్రహ్మ దర్పాన్ని అణచడానికి, మహాదేవుడు తన నుదుటి మధ్య నుంచి భైరవుడిని సృష్టించాడు. తాను ఎవరో, తన కర్తవ్యం ఏంటో భైరవుడు అడగ్గా.. శివుడు ఇలా వివరించాడు. ‘భ’ అంటే భరణం(పోషించడం), ‘ర’ అంటే రవణం(నాశనం చేయడం), ‘వ’ అంటే వమనం(సృష్టించడం). సృష్టి, స్థితి, లయ కారకుడివి నువ్వే కనుక నీవు భైరవుడివి అని నామకరణం చేశాడు. శివుని సంపూర్ణ శక్తి స్వరూపమే భైరవుడు. <<-se>>#SIVOHAM<<>>