News October 9, 2025
IGMCRI 226 పోస్టులకు నోటిఫికేషన్

ఇందిరాగాంధీ మెడికల్ కాలేజీ& రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ 226 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు NOV 6వరకు అప్లై చేసుకోవచ్చు. నర్సింగ్ డిగ్రీ, డిప్లొమా ఇన్ జనరల్ నర్సింగ్, మిడ్ వైఫరీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వయసు 18 -35ఏళ్ల మధ్య ఉండాలి. అకడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.250, SC, STలకు రూ.125. వెబ్‌సైట్: https://igmcri.edu.in/
Similar News
News October 9, 2025
దేశంలో నం.1 కుబేరుడిగా ముకేశ్ అంబానీ

దేశంలో టాప్-100 కుబేరుల జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ మరోసారి అగ్రస్థానంలో నిలిచినట్లు ఫోర్బ్స్ వెల్లడించింది. ప్రస్తుతం ఆయన సంపద 105బి. డాలర్లుగా ఉండగా గత ఏడాదితో పోలిస్తే 12శాతం తగ్గింది. రెండో స్థానంలో 92బి. డాలర్ల ఆదాయంతో గౌతమ్ ఆదానీ ఉన్నారు. సావిత్రి జిందాల్(ఓపీ జిందాల్ గ్రూప్), టెలికాం దిగ్గజం సునీల్ మిత్తల్, టెక్ బిలియనీర్ శివ నాడార్ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
News October 9, 2025
భైరవుడి ఆవిర్భావం: శివుని శక్తి స్వరూపం

సత్యానికి విరుద్ధంగా మాట్లాడిన బ్రహ్మ దర్పాన్ని అణచడానికి, మహాదేవుడు తన నుదుటి మధ్య నుంచి భైరవుడిని సృష్టించాడు. తాను ఎవరో, తన కర్తవ్యం ఏంటో భైరవుడు అడగ్గా.. శివుడు ఇలా వివరించాడు. ‘భ’ అంటే భరణం(పోషించడం), ‘ర’ అంటే రవణం(నాశనం చేయడం), ‘వ’ అంటే వమనం(సృష్టించడం). సృష్టి, స్థితి, లయ కారకుడివి నువ్వే కనుక నీవు భైరవుడివి అని నామకరణం చేశాడు. శివుని సంపూర్ణ శక్తి స్వరూపమే భైరవుడు. <<-se>>#SIVOHAM<<>>
News October 9, 2025
గడువులోపు ఆమోదం తెలపకపోతే చట్టంగా భావిస్తాం: ఏజీ

TG: బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై విచారణలో ప్రభుత్వం బలంగా వాదనలు వినిపిస్తోంది. ఈ బిల్లును గవర్నర్, రాష్ట్రపతికి పంపినా ఆమోదం తెలపలేదని AG సుదర్శన్ రెడ్డి HCకి గుర్తు చేశారు. దీంతో తమిళనాడు కేసును ఉదాహరణగా పేర్కొంటూ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం బీసీ బిల్లు ఆమోదం పొందినట్లేనని స్పష్టం చేశారు. గవర్నర్/రాష్ట్రపతి గడువులోపు బిల్లును ఆమోదించకపోతే చట్టంగా భావించాల్సి ఉంటుందన్నారు.