News October 9, 2025

దామోదర్ రెడ్డి మృతిపై రాహుల్ గాంధీ సంతాపం

image

సూర్యాపేట: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, దివంగత మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి మృతి పట్ల ఏఐసీసీ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ సంతాపం ప్రకటించారు. ఈ మేరకు బుధవారం రాత్రి ఆయన లేఖ ముఖంగా దామోదర్ రెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అలాగే కాంగ్రెస్ పార్టీకి దామన్న చేసిన సేవలను స్మరించుకున్నారు.

Similar News

News October 9, 2025

ADB: ప్రభుత్వ ఉపాధ్యాయుడి SUICIDE

image

ఇచ్చోడ మండలంలోని బోరిగామ జడ్పీఎస్ఎస్ స్కూల్‌లో తెలుగు టీచర్‌గా పనిచేస్తున్న విజయ్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నారు. బజార్హత్నూర్ మండలం వర్తమన్నూర్‌కు చెందిన విజయ్ కుమార్ మావల పోలీస్ స్టేషన్ పరిధిలోని తన ఇంట్లో ఉరేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసుల ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News October 9, 2025

దేశంలో నం.1 కుబేరుడిగా ముకేశ్ అంబానీ

image

దేశంలో టాప్-100 కుబేరుల జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ మరోసారి అగ్రస్థానంలో నిలిచినట్లు ఫోర్బ్స్ వెల్లడించింది. ప్రస్తుతం ఆయన సంపద 105బి. డాలర్లుగా ఉండగా గత ఏడాదితో పోలిస్తే 12శాతం తగ్గింది. రెండో స్థానంలో 92బి. డాలర్ల ఆదాయంతో గౌతమ్ ఆదానీ ఉన్నారు. సావిత్రి జిందాల్(ఓపీ జిందాల్ గ్రూప్), టెలికాం దిగ్గజం సునీల్ మిత్తల్, టెక్ బిలియనీర్ శివ నాడార్ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

News October 9, 2025

KNR: ‘చేతిరాత చదివితే రూపం కన్పించేది’

image

ఉమ్మడి KNRలోని గ్రామాల్లో పోస్ట్‌మెన్‌లు ఇంటింటికీ తిరిగి ఉత్తరాలు పంచేవారు. ఆ ఉత్తరాల్లోని చేతిరాత చదివితే అవతలివారి రూపం కన్పించేది. అక్షరాల స్పర్శలో వారి ఆప్యాయత తెలిసేది. కాగా, ప్రస్తుతం ఫోన్ల వీడియో కాల్స్‌లో ఆ భావోద్వేగం కరవైంది. నేడు ప్రపంచ తపాలా దినోత్సవం సందర్భంగా ఉత్తరాల విలువ, ప్రత్యేకతను గుర్తు చేసుకుందాం. కాగా, కొన్ని గ్రామీణ పోస్ట్ ఆఫీసులు లేఖల సంప్రదాయాన్ని నేటికీ కొనసాగిస్తున్నాయి.