News October 9, 2025

ADB: కోర్టు తీర్పు+నోటిఫికేషన్= ఉత్కంఠ

image

స్థానిక సంస్థల రిజర్వేషన్లకు సంబంధించి ఉత్కంఠ ఇంకా కొనసాగుతోంది. బుధవారం హైకోర్టు తీర్పు వస్తుందని అందరూ ఆశగా ఎదురు చూశారు. అది కాస్త గురువారానికి వాయిదా పడటంతో ఉమ్మడి జిల్లా ఆశావహుల్లో ఆందోళన కొనసాగుతోంది. రిజర్వేషన్లు ఏ స్థాయిలో అమలవుతాయి దానిని బట్టి నామినేషన్లు వేద్దామని భావించారు. నేడు ఓవైపు తీర్పు రావడం, మరోవైపు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుండటంతో ఏం జరుగుతుందోనని ఆంతటా ఆసక్తి నెలకొంది.

Similar News

News October 9, 2025

BTG: వాగులో కొట్టుకుపోతున్న మహిళను రక్షించిన పోలీసులు

image

బుట్టాయగూడెం మండలం జైనవారిగూడెంకు చెందిన ఓ మహిళ జల్లెరు కాలువ దాటుతుండగా నీటి ప్రవాహానికి ప్రమాదవశాత్తు కొట్టుకుపోతుండగా పోలీసులు రక్షించారు. వెల్తురువారిగూడెం వెళ్తుండగా ఈ ప్రమాద ఘటన జరిగింది. ఎస్ఐ దుర్గా మహేశ్వరరావు తన సిబ్బందితో కలిసి గాలించి, ఆమెను సురక్షితంగా రక్షించారు. వర్షాల కారణంగా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఎస్ఐ హెచ్చరించారు.

News October 9, 2025

FLASH: జడ్చర్ల: ‘GOVT స్కూల్‌లో భోజనంలో జెర్రీ’

image

జడ్చర్ల మండలం బాదేపల్లిలోని ప్రభుత్వ బాలుర పాఠశాలలో అక్షయ పాత్ర భోజనంలో ఈరోజు తాడి జెర్రీ వచ్చిందని, విద్యార్థులు అన్నం తినకుండా పడేశారని DYFI MBNR జిల్లా కన్వీనర్ ప్రశాంత్ అన్నారు. ఆయన మాట్లాడుతూ.. మధ్యాహ్నం విద్యార్థులు తినేటప్పుడు అన్నంలో పురుగులు రావడంతో ఇబ్బంది పడుతూ తమకు విషయం చెప్పారని తెలిపారు. ప్రతిరోజు ఇలానే పురుగులు వస్తున్నాయని విద్యార్థులు చెబుతున్నారంటూ అధికారుల తీరుపై మండిపడ్డారు.

News October 9, 2025

రాజమండ్రిలో పవన్ కళ్యాణ్‌కు కలెక్టర్ స్వాగతం

image

కాకినాడ జిల్లా పర్యటన నిమిత్తం గురువారం రాజమండ్రి మధురపూడి విమానాశ్రయానికి చేరుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ఘన స్వాగతం లభించింది. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆయనకు మొక్క అందించి ఆహ్వానించారు. కొద్దిసేపటి తరువాత జనసేన అధినేత అయిన పవన్ కళ్యాణ్ అక్కడి నుండి కాకినాడకు పయనమయ్యారు.