News October 9, 2025
KNR: నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు పూర్తి..!

నేడు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన వెంటనే తొలి విడత ఎన్నికలు జరిగే ZPTC, MPTC స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ మొదలు కానుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా నామినేషన్లు స్వీకరించడానికి అధికారులు అన్నీ ఏర్పాట్లు పూర్తిచేశారు. మొదటి విడతలో KNR జిల్లాలో 6 ZPTC, 70 MPTC, సిరిసిల్ల 7 ZPTC, 65 MPTC, పెద్దపల్లి 7 ZPTC, 68 MPTC, జగిత్యాల 10 ZPTC, 108 MPTC స్థానాలకు మొదటి విడతలో ఎన్నికలు జరగనున్నాయి. SHARE.
Similar News
News October 9, 2025
రాజమండ్రిలో పవన్ కళ్యాణ్‌కు కలెక్టర్ స్వాగతం

కాకినాడ జిల్లా పర్యటన నిమిత్తం గురువారం రాజమండ్రి మధురపూడి విమానాశ్రయానికి చేరుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ఘన స్వాగతం లభించింది. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆయనకు మొక్క అందించి ఆహ్వానించారు. కొద్దిసేపటి తరువాత జనసేన అధినేత అయిన పవన్ కళ్యాణ్ అక్కడి నుండి కాకినాడకు పయనమయ్యారు.
News October 9, 2025
కోనసీమ దుర్ఘటన.. విచారణకు ఉన్నతస్థాయి కమిటీ

AP: కోనసీమ(D) రాయవరంలో బాణసంచా పేలి 8 మంది సజీవదహనమైన విషయం తెలిసిందే. ఈ ఘటనపై దర్యాప్తునకు మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్‌కుమార్ నేతృత్వంలో ప్రభుత్వం ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. పేలుడుకు గల కారణాలు, బాధ్యులను గుర్తించాలని ఆదేశించింది. విచారణ అధ్యయన నివేదికను వారంలోగా సమర్పించాలని ఆదేశించింది.
News October 9, 2025
కాకినాడ: పవన్ కళ్యాణ్ స్టైలిష్ లుక్.. ఫొటోలు వైరల్

ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చాలా రోజుల తర్వాత అధికారిక కార్యక్రమంలో క్యాజువల్ లుక్‌లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. సాధారణంగా తెల్లటి దుస్తుల్లో కనిపించే పవన్ గురువారం కాకినాడ పర్యటన సందర్భంగా క్యాజువల్ దుస్తులు, గాగుల్స్ ధరించారు. రియల్ లైఫ్‌లోనూ స్టైలిష్‌గా ఉన్న ఆయన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.