News October 9, 2025
ఐపీఎస్‌ను బలి తీసుకున్న కుల వివక్ష!

కులవివక్ష రాజకీయాల్లోనే కాదు అధికారులనూ పట్టిపీడిస్తోందని చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనం. సీనియర్ అధికారులు వేధిస్తున్నారని తెలుగువాడైన హరియాణా ADGP పూరన్ కుమార్ 8 పేజీల లేఖ రాసి ఈ నెల 7న ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసు శాఖలో కులవివక్షతో పాటు అక్రమాలపై గళమెత్తడంతో ఉన్నతాధికారులు తనను నాశనం చేసేందుకు కుట్రపన్నారని ఆరోపించారు. లంచం కేసులోనూ ఇరికించారని తుపాకీతో కాల్చుకున్నారు. ఆయన భార్య అమనీత్ IAS.
Similar News
News October 10, 2025
పెర్ఫ్యూమ్ అప్లై చేసేటపుడు ఈ టిప్స్ పాటించండి

ప్రస్తుతకాలంలో పెర్ఫ్యూమ్స్ వాడే వారి సంఖ్య పెరిగింది. అయితే ఆహ్లాదకరమైన సువాసన పొందడానికి కొన్ని టిప్స్ పాటించాలంటున్నారు నిపుణులు. వీటిని సీజన్స్ బట్టి మార్చాలి. ఫ్రెష్ అయిన తర్వాత స్ప్రే చేసుకుంటే ఎక్కువసేపు నిలిచి ఉంటుంది. పల్స్ పాయింట్స్, నెక్, చెవి వెనుక స్ప్రే చెయ్యాలి. మాయిశ్చరైజర్ రాసి, దానిపై పెర్ఫ్యూమ్ స్ప్రే చెయ్యాలి. బాటిల్ ఫ్రిజ్‌లో పెడితే ఫ్రాగ్రెన్స్ ఎక్కువసేపు ఉంటుంది.
News October 10, 2025
రెండో టెస్టు.. భారత్ బ్యాటింగ్

వెస్టిండీస్‌తో జరిగే రెండో టెస్టులో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.
IND: జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, గిల్ (C), ధ్రువ్ జురెల్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, నితీశ్ కుమార్ రెడ్డి, కుల్దీప్ యాదవ్, బుమ్రా, సిరాజ్.
News October 10, 2025
దివ్యశబ్దరాశులే వేద మంత్రాలు

దివ్యబల సంపన్నులైన వేద కాలం నాటి రుషులు తమ ఆధ్యాత్మిక జ్ఞాన సంపదతో దర్శించిన దివ్య శబ్దరాశులే ‘వేద మంత్రాలు’. ఈ రుషులు వేదద్రష్టలే(వేదాలను చూసినవారు) కానీ రచయితలు కాదు. అందుకే వేదాలను శ్రుతులంటారు. అయితే వేద మంత్రాలను స్వరబద్ధంగానే వల్లె వేయాలి. లేకుంటే అనర్థాలు సంభవిస్తాయి. లోకాసమస్తా సుఖినోభవంతు అని అన్ని లోకాలు సుఖంగా ఉండాలి అంటుంది వేదం. <<-se>>#VedikVibes<<>>