News October 9, 2025
సంగారెడ్డి: నామినేషన్ వేద్దామా.. వేచి చూద్దామా?

రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రిజర్వేషన్లు ప్రకటించింది. ప్రభత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పలువురు హైకోర్ట్ మెట్లు ఎక్కగా, కోర్టు కేసును గురువారం మధ్యాహ్నం 2:15కు వాయిదా వేసింది. కొత్త రిజర్వేషన్ల ఆధారంగా ఎన్నికలు నిర్వహిస్తారా? లేదా అనే డైలమాలో ఆశావహులున్నారు. సంగారెడ్డి జిల్లాలో NKD, ZHB డివిజన్‌లో నేడు నామినేషన్ వేద్దామా, వేచిచూదమా? అనే సందిగ్ధంలో అభ్యర్థులు ఉన్నారు.
Similar News
News October 9, 2025
ఉదయం ఎన్నికల నోటిఫికేషన్, సాయంత్రం స్టే

తెలంగాణలో స్థానిక ఎన్నికల ప్రక్రియకు బ్రేక్ పడింది. ఎన్నికల కోసం పల్లెలు ఏడాదిగా ఎదురుచూస్తుంటే అనేక గందరగోళాలు, వివాదాల అనంతరం ఎట్టకేలకు ఎన్నికల సంఘం ఇటీవల షెడ్యూల్ ఇచ్చింది. ఈ ఎన్నికల్లో BCలకు 42% రిజర్వేషన్లను ఇవ్వడాన్ని సవాల్ చేయడంపై హైకోర్టు రెండ్రోజులు విచారించి తాజాగా స్టే ఇచ్చింది. దీంతో ఈ ఉదయం గం.10:30కి వచ్చిన తొలి ఫేజ్ నోటిఫికేషన్ సాయంత్రం గం.4కు అర్థరహితంగా మారిపోయింది.
News October 9, 2025
ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయనుంది?

TG: బీసీ రిజర్వేషన్లు 42% పెంచడంపై HCలో ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. GO-9తో పాటు విడుదలైన ఎన్నికల నోటిఫికేషన్‌పైనా ధర్మాసనం స్టే విధించింది. దీంతో ఇప్పుడు INC సర్కార్ ఏం చేస్తుందనేది ఉత్కంఠగా మారింది. ముందే నిర్ణయించుకున్నట్లు ‘ప్లాన్-బి’ ప్రకారం పార్టీ తరఫున బీసీలకు 42% సీట్లు కేటాయించే అవకాశం ఉంది. ఇలా చేయాలంటే మళ్లీ ఎన్నికల షెడ్యూల్, నోటిఫికేషన్లు ఇవ్వాల్సి ఉంటుంది.
News October 9, 2025
CM చంద్రబాబు పర్యటనపై కొనసాగుతున్న సందిగ్ధత.?

CM చంద్రబాబు శుక్రవారం నెల్లూరు జిల్లాలో పర్యటించాల్సి ఉంది. సర్వేపల్లి నియోజకవర్గంలోపాటు సిటీ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన ప్రారంభోత్సవాలు చెయ్యాలి. ఈ క్రమంలో జిల్లా అధికారులు హెలిపాడ్‌ను సైతం సిద్ధం చేశారు. అయితే ఇంతవరకు సీఎం పర్యటన అధికారకంగా ఖరారు కాలేదు. నెల్లూరులో అడపదడప కురుస్తున్న వర్షాల నేపథ్యంలో చంద్రబాబు పర్యటనపై ఉత్కంఠ నెలకొంది.