News October 9, 2025
కర్లపాలెంలో ఉదయాన్నే మందు బాబుల విన్యాసాలు

కర్లపాలెంలో సమయపాలన లేకుండా వైన్ షాపులు నిర్వహించడంతో వేకువజామునంచే మద్యం బాబులు రహదారులపై దర్శనమిస్తున్నారు. ఉదయం 7 గంటల నుంచి మద్యం షాపులు నిర్వహించడంతో మద్యం బాబులు మద్యం మత్తులో రహదారులపై పడిపోతూ వాహనదారులకు, పాదాచారులకు ఇబ్బందులు కలిగిస్తున్నారు. ఇప్పటికైనా ఎక్సైజ్ అధికారులు స్పందించి వైన్ షాపులు సమయపాలన పాటించేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
Similar News
News October 9, 2025
₹6లక్షల కోట్లతో 10000 KM గ్రీన్‌ఫీల్డ్ హైవేలు

దేశంలో ₹6 లక్షల కోట్లతో 10వేల KMమేర 25 గ్రీన్‌ఫీల్డ్ హైవేలను నిర్మిస్తున్నట్లు మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. ‘ఈ ప్రాజెక్టుల వల్ల ₹15L కోట్ల ఆదాయం రానుంది. ఎక్స్‌ప్రెస్ హైవేలతో లాజిస్టిక్స్ కాస్ట్ 16% నుంచి 10%కి వచ్చింది. DECకి 9%కి తగ్గుతుంది’ అని చెప్పారు. దేశ AUTO రంగం ₹22 L కోట్లుగా ఉందని, 5 ఏళ్లలో వరల్డ్ నంబర్1 అవుతుందని తెలిపారు. US ₹78L కోట్లు, చైనా ₹47L కోట్లు కాగా IND 3వ ప్లేస్.
News October 9, 2025
ADB: తొలి విడత ఎన్నికలు జరిగే ZPTC/ MPTC స్థానాలు

ADB: తొలుత మొదటి దశలో ఆదిలాబాద్ జిల్లాలో ఎంపీటీసీ 80 , జెడ్పీటీసీ 10 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. తొలి విడత ఎన్నికలు జరిగే ZPTC/ MPTC స్థానాలు.. బజార్హత్నూర్ (08) , భీంపూర్ (07), బోథ్ (10), ఇచ్చోడ (13), గుడిహత్నూర్ (09), నేరడిగొండ (08), సిరికొండ (05), సోనాల (05),
తలమడుగు (10), తాంసి (05) ఉన్నాయి.
News October 9, 2025
భారతదేశపు తొలి ఫోరెన్సిక్ నిపుణురాలు

సాంప్రదాయ ఆహార్యంలో కనిపించే రుక్మిణీ కృష్ణమూర్తిని చూసి ఎవరూ ఫోరెన్సిక్ నిపుణురాలు అనుకోరు. 1993 ముంబయి పేలుళ్లు, తెల్గీ స్టాంపు కుంభకోణం, 26/11 ఉగ్రదాడి, కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ కేసుల్లో కీలకంగా వ్యవహరించారు. చెన్నైలో జన్మించిన రుక్మిణీ కృష్ణమూర్తి అనలిటికల్ కెమిస్ట్రీలో PG, PhD చేశారు. మహారాష్ట్ర ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో సైంటిస్ట్‌గా చేరి, డైరెక్టర్ స్థాయికి ఎదిగారు. <<-se>>#firstwomen<<>>