News October 9, 2025
20 మంది చిన్నారుల మృతి.. ‘శ్రేసన్’ ఓనర్ అరెస్ట్

దగ్గు <<17954495>>మందు<<>> అంటేనే భయపడేలా కోల్డ్రిఫ్ కాఫ్ సిరప్ తయారు చేసిన శ్రేసన్ కంపెనీ(తమిళనాడు) ఓనర్ రంగనాథన్‌ను మధ్యప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. చిన్నారుల మరణాలతో ఈ నెల 1, 2 తేదీల్లో అధికారులు చేసిన తనిఖీల్లో గ్యాస్ స్టవ్‌లపై రసాయనాలు వేడి చేయడం, తుప్పు పట్టిన పరికరాలు గుర్తించారు. అనుభవం లేని సిబ్బంది, గ్లౌజులు, మాస్కులు లేకుండా పనిచేస్తున్నట్లు గమనించారు. అనంతరం కంపెనీని సీజ్ చేశారు.
Similar News
News October 9, 2025
పార్టీ పరంగా బీసీలకు 42శాతం రిజర్వేషన్లు: వాకిటి

TG: ప్రభుత్వం 42% రిజర్వేషన్లు ఇవ్వాలని చూస్తే బీసీల నోటి కాడ ముద్ద లాక్కుంటున్నారని మంత్రి వాకిటి శ్రీహరి మండిపడ్డారు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా బీసీలకు న్యాయం చేసేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉన్నట్లు హైకోర్టు వద్ద మాట్లాడారు. పార్టీ పరంగా బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇవ్వడంలో వెనక్కి పోయేదేలేదని మంత్రి స్పష్టం చేశారు. BRS, BJP కుమ్మక్కు వల్లే HC స్టే విధించిందని మంత్రి జూపల్లి ఆరోపించారు.
News October 9, 2025
మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవు

కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవు ఇచ్చేందుకు నిర్ణయించింది. ప్రభుత్వ కార్యాలయాలు, గార్మెంట్ ఇండస్ట్రీస్, మల్టీనేషనల్ కంపెనీలు, IT సంస్థలు, ఇతర ప్రైవేట్ ఆర్గనైజేషన్స్‌లో నెలకొక పెయిడ్ లీవ్ చొప్పున ఇవ్వాలని వెల్లడించింది. మహిళల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వారిని ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
News October 9, 2025
రాష్ట్ర బంద్‌కు పిలుపునిస్తాం: ఆర్.కృష్ణయ్య

TG: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే విధించడంపై బీసీ నేత ఆర్.కృష్ణయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని, బీసీల నోటికాడి ముద్దను లాగేశారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ తొందరపాటు వల్లే తమకు అన్యాయం జరిగిందని విమర్శించారు. బీసీల సత్తా ఏంటో చూపిస్తామన్నారు. ఇవాళ సాయంత్రంలోగా ప్రభుత్వ స్పందన చూసి రేపటి నుంచి బంద్‌కు పిలుపునిస్తామని స్పష్టం చేశారు.