News October 9, 2025
GWL: ప్రియాంక మృతిపై తండ్రి సంచలన ఆరోపణలు

గట్టు మండలం చిన్నోనిపల్లిలో 3 నెలలు న్యాయపోరాటం చేసిన ప్రియాంక మృతిపై ఆమె తండ్రి రాంబాబు సంచలన ఆరోపణలు చేశారు. తన కూతురు ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, పథకం ప్రకారం పాయిజన్ ఇచ్చి చంపారని ఆయన ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈ నెల 3న రాత్రి 9:30కి మాట్లాడానని, కొద్దిసేపటికే పురుగుమందు తాగింది అంటూ ఫోన్ వచ్చిందని తెలిపారు. ఆసుపత్రిలో ఎవరూ పట్టించుకోలేదని ఆరోపించారు.
Similar News
News October 9, 2025
భారతదేశపు తొలి ఫోరెన్సిక్ నిపుణురాలు

సాంప్రదాయ ఆహార్యంలో కనిపించే రుక్మిణీ కృష్ణమూర్తిని చూసి ఎవరూ ఫోరెన్సిక్ నిపుణురాలు అనుకోరు. 1993 ముంబయి పేలుళ్లు, తెల్గీ స్టాంపు కుంభకోణం, 26/11 ఉగ్రదాడి, కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ కేసుల్లో కీలకంగా వ్యవహరించారు. చెన్నైలో జన్మించిన రుక్మిణీ కృష్ణమూర్తి అనలిటికల్ కెమిస్ట్రీలో PG, PhD చేశారు. మహారాష్ట్ర ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో సైంటిస్ట్‌గా చేరి, డైరెక్టర్ స్థాయికి ఎదిగారు. <<-se>>#firstwomen<<>>
News October 9, 2025
ఉదయం ఎన్నికల నోటిఫికేషన్, సాయంత్రం స్టే

తెలంగాణలో స్థానిక ఎన్నికల ప్రక్రియకు బ్రేక్ పడింది. ఎన్నికల కోసం పల్లెలు ఏడాదిగా ఎదురుచూస్తుంటే అనేక గందరగోళాలు, వివాదాల అనంతరం ఎట్టకేలకు ఎన్నికల సంఘం ఇటీవల షెడ్యూల్ ఇచ్చింది. ఈ ఎన్నికల్లో BCలకు 42% రిజర్వేషన్లను ఇవ్వడాన్ని సవాల్ చేయడంపై హైకోర్టు రెండ్రోజులు విచారించి తాజాగా స్టే ఇచ్చింది. దీంతో ఈ ఉదయం గం.10:30కి వచ్చిన తొలి ఫేజ్ నోటిఫికేషన్ సాయంత్రం గం.4కు అర్థరహితంగా మారిపోయింది.
News October 9, 2025
ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయనుంది?

TG: బీసీ రిజర్వేషన్లు 42% పెంచడంపై HCలో ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. GO-9తో పాటు విడుదలైన ఎన్నికల నోటిఫికేషన్‌పైనా ధర్మాసనం స్టే విధించింది. దీంతో ఇప్పుడు INC సర్కార్ ఏం చేస్తుందనేది ఉత్కంఠగా మారింది. ముందే నిర్ణయించుకున్నట్లు ‘ప్లాన్-బి’ ప్రకారం పార్టీ తరఫున బీసీలకు 42% సీట్లు కేటాయించే అవకాశం ఉంది. ఇలా చేయాలంటే మళ్లీ ఎన్నికల షెడ్యూల్, నోటిఫికేషన్లు ఇవ్వాల్సి ఉంటుంది.