News October 9, 2025

అట్లతద్దిని మీరు ఎలా జరుపుకుంటున్నారు?

image

ఒకప్పుడు అట్లతద్ది పర్వదినం ఉయ్యాలలు కట్టుకొని ఆడుతూ, పాటలు పాడుతూ సందడి చేసేవారు. అట్లతద్ది రోజున మహిళలు తెల్లవారుజామున స్నానం చేసి, అన్నం తిని ఉపవాసం మొదలుపెట్టి, సాయంత్రం చంద్రోదయం తర్వాత అట్లు తిని ఉపవాసం విరమిస్తారు. మహిళలు ఒకచోట చేరి, పెద్ద చెట్లకు ఉయ్యాలలు కట్టుకొని ఆడుకుంటూ, చప్పట్లు కొడుతూ, పాటలు పాడటం ఒక ఆనవాయితీ. అయితే రాను రాను ఈ ఆనవాయితీలు కనుమరుగవుతున్నాయి. దీనిపై మీ కామెంట్?

Similar News

News October 30, 2025

గుంటూరు జిల్లాను ముంచెత్తిన వాన

image

మొథా తుపాన్‌ ప్రభావంతో గుంటూరు జిల్లాలో మంగళవారం రాత్రి నుంచి బుధవారం వరకు భారీ వర్షాలు కురిశాయి. కాకుమానులో అత్యధికంగా 116.6 మి.మీ వర్షపాతం నమోదైంది. పెదనందిపాడు 114.6, ప్రత్తిపాడు 109.4, చేబ్రోలు 91.4, కొల్లిపర 78.4, వట్టిచెరుకూరు 76.2 మి.మీ వర్షపాతం నమోదైంది. తాడేపల్లి, దుగ్గిరాల, తెనాలి, మంగళగిరి ప్రాంతాల్లో కూడా మోస్తరు వర్షం కురవడంతో తక్కువ ఎత్తున్న ప్రాంతాలు నీటమునిగాయి.

News October 30, 2025

GNT: తుపాను ప్రభావంతో తగ్గిన ఆర్టీసీ ఆదాయం

image

మొంథా తుపాను కారణంగా మంగళ, బుధవారాల్లో ప్రయాణికుల రాకపోకలు తగ్గడంతో ఆర్టీసీ ఆదాయానికి భారీ దెబ్బ తగిలింది. సాధారణంగా రోజుకు రూ.73 లక్షల వసూళ్లు వచ్చే గుంటూరు జిల్లాలో మంగళవారం రూ.41 లక్షలు, బుధవారం రూ.25 లక్షలకే పరిమితమైంది. జాగ్రత్త చర్యగా అనేక రూట్లలో సర్వీసులు నిలిపివేశారు. శ్రీశైలం, హైదరాబాద్, బెంగళూరు రూట్లు తాత్కాలికంగా రద్దు కాగా, గురువారం నుంచి మిగిలిన మార్గాల్లో బస్సులు మళ్లీ నడవనున్నాయి.

News October 30, 2025

GNT: రంగస్థల కళాకారుడి నుంచి దర్శకుడు దాకా

image

ప్రముఖ రంగస్థల కళాకారుడు, నట శిక్షకుడు, తెలుగు సినిమా దర్శకులు బీరం మస్తాన్‌ రావు (అక్టోబర్ 30, 1944-జనవరి 28, 2014) గుంటూరులో జన్మించారు. అల్లు రామలింగయ్య, సుత్తి వీరభద్రరావు, జమున, గరికపాటి రాజారావు, తదితరులతో కలిసి నాటకాలలో నటించారు. బాలమిత్రుల కథ చిత్రంతో సహాయ దర్శకుడిగా సినిమా జీవితాన్ని ప్రారంభించారు. దర్శకుడిగా ఆయనకు తొలిచిత్రం కృష్ణ-శ్రీదేవి జంటగా నటించిన బుర్రిపాలెం బుల్లోడు.