News October 9, 2025
MHBD: స్థానిక అభ్యర్థుల భవితవ్యం తేల్చనున్న ఓటర్లు!

మహబూబాబాద్ జిల్లాలో రెండు విడతల్లో రానున్న స్థానిక సమరంలో అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు తేల్చనున్నారు. దాదాపు రెండేళ్ల నుంచి వాయిదా పడుతూ వస్తున్న స్థానిక ఎన్నికలు ఎట్టకేలకు త్వరలో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాలోని 193 ఎంపీటీసీ, 18 జడ్పీటీసీ స్థానాలకు అన్ని పార్టీల అభ్యర్థులు తలపడనున్నారు. ఓటర్ల నాడి ఎలా ఉందో తెలుసుకునేందుకు మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.
Similar News
News October 9, 2025
ఉదయం ఎన్నికల నోటిఫికేషన్, సాయంత్రం స్టే

తెలంగాణలో స్థానిక ఎన్నికల ప్రక్రియకు బ్రేక్ పడింది. ఎన్నికల కోసం పల్లెలు ఏడాదిగా ఎదురుచూస్తుంటే అనేక గందరగోళాలు, వివాదాల అనంతరం ఎట్టకేలకు ఎన్నికల సంఘం ఇటీవల షెడ్యూల్ ఇచ్చింది. ఈ ఎన్నికల్లో BCలకు 42% రిజర్వేషన్లను ఇవ్వడాన్ని సవాల్ చేయడంపై హైకోర్టు రెండ్రోజులు విచారించి తాజాగా స్టే ఇచ్చింది. దీంతో ఈ ఉదయం గం.10:30కి వచ్చిన తొలి ఫేజ్ నోటిఫికేషన్ సాయంత్రం గం.4కు అర్థరహితంగా మారిపోయింది.
News October 9, 2025
ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయనుంది?

TG: బీసీ రిజర్వేషన్లు 42% పెంచడంపై HCలో ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. GO-9తో పాటు విడుదలైన ఎన్నికల నోటిఫికేషన్‌పైనా ధర్మాసనం స్టే విధించింది. దీంతో ఇప్పుడు INC సర్కార్ ఏం చేస్తుందనేది ఉత్కంఠగా మారింది. ముందే నిర్ణయించుకున్నట్లు ‘ప్లాన్-బి’ ప్రకారం పార్టీ తరఫున బీసీలకు 42% సీట్లు కేటాయించే అవకాశం ఉంది. ఇలా చేయాలంటే మళ్లీ ఎన్నికల షెడ్యూల్, నోటిఫికేషన్లు ఇవ్వాల్సి ఉంటుంది.
News October 9, 2025
CM చంద్రబాబు పర్యటనపై కొనసాగుతున్న సందిగ్ధత.?

CM చంద్రబాబు శుక్రవారం నెల్లూరు జిల్లాలో పర్యటించాల్సి ఉంది. సర్వేపల్లి నియోజకవర్గంలోపాటు సిటీ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన ప్రారంభోత్సవాలు చెయ్యాలి. ఈ క్రమంలో జిల్లా అధికారులు హెలిపాడ్‌ను సైతం సిద్ధం చేశారు. అయితే ఇంతవరకు సీఎం పర్యటన అధికారకంగా ఖరారు కాలేదు. నెల్లూరులో అడపదడప కురుస్తున్న వర్షాల నేపథ్యంలో చంద్రబాబు పర్యటనపై ఉత్కంఠ నెలకొంది.