News October 9, 2025
కనకాంబరంలో ఆకుమచ్చ తెగులు

కనకాంబరం పంటను ఆశించే చీడపీడల్లో ఆకుమచ్చ తెగులు ఒకటి. ఆకుమచ్చ తెగులు సోకిన కనకాంబరం మొక్క ఆకు పైభాగంలో చిన్న, గుండ్రని పసుపు పచ్చ మచ్చలు ఏర్పడి.. తర్వాత గోధుమ రంగులోకి మారతాయి. తెగులు సోకిన ఆకులు ఎండిపోయి రాలిపోతాయి. దీని వల్ల మొక్క ఎదుగుదలపై ప్రభావం పడుతుంది. ఈ తెగులు నివారణకు 2.5గ్రా మాంకోజెబ్‌ను లీటర్ నీటికి కలిపి ఆకులన్నీ తడిచేలా పిచికారీ చేయాలి.
Similar News
News October 10, 2025
బిజినెస్ న్యూస్ రౌండప్

* 2025-26 FY రెండో త్రైమాసికంలో రూ.12,075 కోట్ల నికర లాభం ప్రకటించిన TCS. ఒక్కో షేర్‌పై రూ.11 మధ్యంతర డివిడెండ్ ప్రకటన
* LG ఎలక్ట్రానిక్స్ IPO సూపర్ సక్సెస్: 7.13 కోట్ల షేర్లు జారీ చేయగా 385 కోట్ల షేర్లకు బిడ్స్ దాఖలు. వీటి విలువ దాదాపు రూ.4.4 లక్షల కోట్లు. ఇవాళ IPO అలాట్‌మెంట్
* నేడు భేటీ కానున్న టాటా సంస్థల ట్రస్టీలు. కొద్దిరోజులుగా బోర్డు సభ్యుల మధ్య నెలకొన్న విభేదాలకు తెరదించే అవకాశం
News October 10, 2025
పెర్ఫ్యూమ్ అప్లై చేసేటపుడు ఈ టిప్స్ పాటించండి

ప్రస్తుతకాలంలో పెర్ఫ్యూమ్స్ వాడే వారి సంఖ్య పెరిగింది. అయితే ఆహ్లాదకరమైన సువాసన పొందడానికి కొన్ని టిప్స్ పాటించాలంటున్నారు నిపుణులు. వీటిని సీజన్స్ బట్టి మార్చాలి. ఫ్రెష్ అయిన తర్వాత స్ప్రే చేసుకుంటే ఎక్కువసేపు నిలిచి ఉంటుంది. పల్స్ పాయింట్స్, నెక్, చెవి వెనుక స్ప్రే చెయ్యాలి. మాయిశ్చరైజర్ రాసి, దానిపై పెర్ఫ్యూమ్ స్ప్రే చెయ్యాలి. బాటిల్ ఫ్రిజ్‌లో పెడితే ఫ్రాగ్రెన్స్ ఎక్కువసేపు ఉంటుంది.
News October 10, 2025
రెండో టెస్టు.. భారత్ బ్యాటింగ్

వెస్టిండీస్‌తో జరిగే రెండో టెస్టులో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.
IND: జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, గిల్ (C), ధ్రువ్ జురెల్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, నితీశ్ కుమార్ రెడ్డి, కుల్దీప్ యాదవ్, బుమ్రా, సిరాజ్.