News October 9, 2025

APPLY NOW: IPRCLలో 28 ఉద్యోగాలు

image

ఇండియన్ పోర్ట్ రైల్ అండ్ రోప్‌వే కార్పొరేషన్ లిమిటెడ్(IPRCL)లో 28 పోస్టులకు దరఖాస్తు చేయడానికి రేపే ఆఖరు తేదీ(OCT 10). వీటిలో 18 ప్రాజెక్ట్ సైట్ ఇంజినీర్ పోస్టులు, 10 అప్రెంటిస్‌ పోస్టులు ఉన్నాయి. బీటెక్, బీఈ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. ప్రాజెక్ట్ సైట్ ఇంజినీర్ పోస్టులకు గరిష్ఠ వయోపరిమితి 32ఏళ్లు. అకడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://iprcl.in/

Similar News

News October 9, 2025

మంచి భార్య కోసం వ్రతాలు ఉండవా?

image

మంచి భర్తను పొందడానికి అమ్మాయిలు అనేక వ్రతాలు ఆచరిస్తారు. అలాగే సుగుణ సతీమణిని పొందడానికి అబ్బాయిలకూ ఓ దివ్యమార్గం ఉందని పండితులు చెబుతున్నారు. యువకులు దుర్గామాతను స్తుతిస్తూ ‘‘పత్నీం మనోరమాం దేహి మనోవృత్తానుసారిణీం.. తారిణీం దుర్గ సంసార సాగరస్య కులోద్భవామ్’’ అనే శ్లోకాన్ని రోజూ పఠించాలని సూచిస్తున్నారు.
* ప్రతిరోజూ ధర్మసందేహాలు-సమాధానాలు, ఆధ్యాత్మిక సమాచారం కోసం <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>.

News October 9, 2025

ఇది కాంగ్రెస్ డ్రామా: హరీశ్ రావు

image

TG: ఆరు గ్యారంటీల్లాగే బీసీలకు 42శాతం రిజర్వేషన్లూ కాంగ్రెస్ డ్రామా అని మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. ‘55 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ ఏనాడైనా బీసీల కోసం పనిచేసిందా? చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ జాతీయ నేతలతో ఢిల్లీ వేదికగా కొట్లాడాలి. కలిసి వచ్చేందుకు మా పార్టీ ఎప్పుడూ సిద్ధంగా ఉంది. స్థానిక ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు చేసిన కుట్రలు విఫలం అయ్యాయి’ అని విమర్శించారు.

News October 9, 2025

రేపు రాష్ట్ర బంద్‌కు తీన్మార్ మల్లన్న పిలుపు

image

TG: BC రిజర్వేషన్ల అంశంలో ప్రభుత్వం ఎటూ తేలని నిర్ణయాలు తీసుకుంటుందని తెలంగాణ రాజ్యాధికార పార్టీ చీఫ్ తీన్మార్ మల్లన్న ఆరోపించారు. తాజా పరిణామాలపై రేపు రాష్ట్ర బంద్‌కు పిలుపునిస్తున్నట్లు Way2Newsకు తెలిపారు. BC రిజర్వేషన్ల అంశంపై బాధ్యత వహిస్తూ CM రేవంత్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా BCలు నిరసన తెలుపాలని, కాంగ్రెస్ ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేయాలని పిలుపునిచ్చారు.