News October 9, 2025

HYD: అడుగడుగునా పోలీసులు

image

బీఆర్ఎస్ ఛలో బస్ భవన్ పిలుపు మేరకు సిటీలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మెహదీపట్నం నుంచి బస్ భవన్‌కు హరీశ్ రావు బస్సులో బయల్దేరారు. రేతిఫైల్ నుంచి KTR ఆర్టీసీ క్రాస్ రోడ్డుకు వచ్చారు. ఈ క్రమంలో పోలీసులు ఎక్కడికక్కడ మోహరించారు. పోలీసుల బందోబస్తు చూసి BRS నేతలు ఖంగుతిన్నారు. ఇంతకీ చలో బస్ భవన్ నేతలా? లేక పోలీసులా? పిలుపునిచ్చింది అంటూ SMలో ఫొటోస్ పెట్టి మరీ కామెంట్లు చేస్తున్నారు.

Similar News

News October 9, 2025

ఓయూ LLM పరీక్షా తేదీల ఖరారు

image

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని LLM పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ తెలిపారు. LLM 2, నాలుగో సెమిస్టర్ రెగ్యులర్, అన్ని సెమిస్టర్ల బ్యాక్ లాగ్ పరీక్షలను ఈ నెల 13వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు చెప్పారు. పరీక్షా తేదీల పూర్తి వివరాలను ఓయూ వెబ్‌సైట్ www.osmania.ac.inలో చూసుకోవచ్చని సూచించారు.

News October 9, 2025

సైబర్ మోసాలపై HYD సైబర్ క్రైమ్ పోలీసుల సూచన

image

ఆన్‌లైన్ ట్రేడింగ్ మోసాలపై సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా నకిలీ ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్లు ప్రజలను మోసం చేస్తున్నారని వెల్లడించారు. చిన్న ఇన్వెస్ట్‌మెంట్‌తో మొదలై పెద్ద మొత్తంలో డబ్బులు దోచుకుంటున్నారని తెలిపారు. నకిలీ వెబ్‌సైట్లలో ఫేక్ లాభాలు చూపించి, ట్యాక్స్‌లు, ఫీజుల పేరుతో మరిన్ని డబ్బులు వసూలు చేస్తున్నారని హెచ్చరిస్తున్నారు. 1930, వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయండి.

News October 9, 2025

‘మేము రాము భర్కత్‌పురా PF ఆఫీస్‌కు’

image

భర్కత్‌పురా PF ఆఫీస్‌లో అర్జీదారుల కష్టాలు వర్ణణాతీతం. ఇతర జిల్లాల నుంచి వచ్చిన వారు, స్థానికులు గంటల తరబడి లైన్లలో నిలబడాల్సి వస్తోందని, మరోసారి మేము రాము భర్కత్‌పుర PF ఆఫీస్‌కు అంటున్నారు. స్లిప్‌లు, సెక్షన్ మార్పులతో రోజంతా తిరగాల్సి వస్తోందని వాపోతున్నారు. ఒకేసారి వివరాలు చెప్పే PROని నియమించాలని కోరుతున్నారు. తాగడానికి మంచినీళ్లు లేవని, ఓపిక లేక బయటవచ్చి కూర్చున్నామని చెబుతున్నారు.