News October 9, 2025
సెలక్షన్ నా చేతుల్లో ఉండదు: షమీ

ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు తనను ఎంపిక చేయకపోవడంపై స్టార్ పేసర్ మహమ్మద్ షమీ స్పందించారు. ‘సెలక్షన్ అనేది నా చేతుల్లో ఉండదు. అది సెలక్షన్ కమిటీ, కోచ్, కెప్టెన్ల నిర్ణయం. నేను జట్టులో ఉండాలనుకుంటే సెలక్ట్ చేస్తారు. లేదంటే లేదు. నేను ఇప్పుడు ఫిట్‌గా ఉన్నాను. దులీప్ ట్రోఫీలో 35 ఓవర్లు వేశాను’ అని చెప్పారు. కెప్టెన్సీ మార్పు అనేది నిరంతర ప్రక్రియ అని, గిల్‌కు అనుభవం ఉందని తెలిపారు.
Similar News
News October 9, 2025
348 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ 348 GDS ఎగ్జిక్యూటివ్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. డిగ్రీ అర్హతగల అభ్యర్థులు ఈ నెల 29 వరకు అప్లై చేసుకోవచ్చు. ఏపీలో 8, తెలంగాణలో 9 పోస్టులు ఉన్నాయి. అభ్యర్థుల వయసు 20 నుంచి 35ఏళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ.750. వెబ్‌సైట్: https://www.ippbonline.com/
News October 9, 2025
గ్రే డైవోర్స్ గురించి తెలుసా?

ప్రస్తుత కాలంలో ముప్ఫైఏళ్లకుపైగా దాంపత్యబంధంలో ఉండి, బాధ్యతలు తీరిన తర్వాత మలివయసులో కోర్టు మెట్లెక్కుతున్న జంటలు పెరుగుతున్నాయంటున్నాయి పలు అధ్యయనాలు. వీటిని ‘గ్రే డైవోర్స్’ అంటున్నారు. దీనికి సంబంధించి ఇటీవల చేసిన ఓ అధ్యయనంపై ‘జర్నల్ ఆఫ్ సోషల్ అండ్ పర్సనల్ రిలేషన్‌షిప్స్’లో ప్రచురించారు. భార్యాభర్తలిద్దరూ దీర్ఘకాలిక అసంతృప్తికి గురవ్వడం ఈ విడాకులకు ప్రధాన కారణం అని పరిశోధకులు అంటున్నారు.
News October 9, 2025
మంచి భార్య కోసం వ్రతాలు ఉండవా?

మంచి భర్తను పొందడానికి అమ్మాయిలు అనేక వ్రతాలు ఆచరిస్తారు. అలాగే సుగుణ సతీమణిని పొందడానికి అబ్బాయిలకూ ఓ దివ్యమార్గం ఉందని పండితులు చెబుతున్నారు. యువకులు దుర్గామాతను స్తుతిస్తూ ‘‘పత్నీం మనోరమాం దేహి మనోవృత్తానుసారిణీం.. తారిణీం దుర్గ సంసార సాగరస్య కులోద్భవామ్’’ అనే శ్లోకాన్ని రోజూ పఠించాలని సూచిస్తున్నారు.
* ప్రతిరోజూ ధర్మసందేహాలు-సమాధానాలు, ఆధ్యాత్మిక సమాచారం కోసం <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>.