News October 9, 2025
ఉడిత్యాలలో అత్యధిక వర్షపాతం

మహబూబ్‌నగర్ జిల్లాలో గడిచిన 24 గంటల్లో పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. బాలానగర్ మండలం ఉడిత్యాలలో 13.8 మి.మీ. అత్యధిక వర్షపాతం నమోదైంది. చిన్నచింతకుంట మండలం వడ్డేమాన్‌లో 8.5 మి.మీ., జడ్చర్లలో 6.5 మి.మీ., నవాబుపేటలో 3.5 మి.మీ., మిడ్జిల్‌లో 2.8 మి.మీ., కౌకుంట్ల 2.0 మి.మీ., చిన్నచింతకుంటలో 1.8 మి.మీ. వర్షం కురిసినట్లు అధికారులు తెలిపారు.
Similar News
News October 9, 2025
పాలమూరు: ‘ఎన్.ఎస్.ఎస్ వాలంటీర్లు సమాజ సేవకు అంకితం అవ్వాలి’

ఎన్.ఎస్.ఎస్ వాలంటీర్లు సమాజ సేవకు అంకితం అవ్వాలని పాలమూరు యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ ప్రవీణ అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని సెంట్రల్ లైబ్రరీలో ఏడు రోజుల క్యాంపును నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు మూఢనమ్మకాలు, బాల్య వివాహాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ప్రస్తుత సమాజంలో జరుగుతున్న సైబర్ నేరాలపై కూడా అవగాహన కల్పించాలని కోరారు.
News October 9, 2025
జడ్చర్ల: భవిత కేంద్రంలో కలెక్టర్ తనిఖీ

ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలో ఏర్పాటు చేసిన భవిత కేంద్రాన్ని కలెక్టర్ విజయేందిర బోయి గురువారం తనిఖీ చేశారు. భవిత కేంద్రంలో పిల్లలకు అందిస్తోన్న ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీ విధానాన్ని పరిశీలించారు. నిర్మాణంలో ఉన్న టాయిలెట్‌ను పరిశీలించారు. టాయిలెట్‌లోకి వెళ్లేందుకు భవనం నుంచి దారి ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ మంజుల పాల్గొన్నారు.
News October 9, 2025
MBNR: ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్

మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండల పరిషత్ కార్యాలయంలో కొడుగల్ గ్రామపంచాయతీ కార్యాలయం క్లస్టర్‌లో ఎంపీటీసీ నామినేషన్ స్వీకరణ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి ఈరోజు పరిశీలించారు. అనంతరం ఎన్నికల సజావు నిర్వహణ, భద్రత, ఉద్యోగుల సంఖ్య, మౌలిక వసతులు సదుపాయాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.