News October 9, 2025
మ్యాగజైన్ కంటెంట్.. ఇక ప్రతిరోజూ..

Way2News యునిక్ ఫీచర్లలో ఒకటైన మ్యాగజైన్‌కు విశేష ఆదరణ ఉంది. భక్తి, జాబ్స్, పాడిపంట, వసుధ.. ఇలా వారంలో రోజూ ఒక్కో థీమ్‌తో అందించే కంటెంట్‌ను ప్రతిరోజూ ఇవ్వాలని కొత్తగా కేటగిరీలు తీసుకొచ్చాము. దీంతో మీరు మెచ్చిన కంటెంట్ కోసం వారం రోజులు వేచి చూడకుండా ప్రతిరోజూ చదువుకోవచ్చు. యాప్‌లో కింద భాగంలో కేటగిరీలు క్లిక్ చేసి నేరుగా నచ్చిన కంటెంట్ పొందండి. కేటగిరీలు కన్పించలేదంటే <
Similar News
News January 31, 2026
అమలాపురం: నేటి నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్

ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఆదివారం నుంచి ప్రయోగ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 1 నుంచి 10 వరకు జరిగే ఈ పరీక్షల కోసం అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 51 కేంద్రాలను సిద్ధం చేసినట్లు DIEO చంద్రశేఖర్ బాబు శనివారం తెలిపారు. మొత్తం 8,900 మంది విద్యార్థులు ఎంపీసీ, బైపీసీ పరీక్షలకు హాజరుకానున్నారు. ఉదయం, మధ్యాహ్నం రెండు విడతల్లో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఆయన వివరించారు.
News January 31, 2026
ఢిల్లీ హైకోర్టులో 152 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

<
News January 31, 2026
మొక్కజొన్నలో జింక్ లోపం – నివారణ

వాతావరణం చల్లగా ఉన్నప్పుడు, మోతాదుకు మించి భాస్వరం ఎరువులను వాడినప్పుడు, అధిక నీటి ముంపునకు గురైనప్పుడు మొక్కజొన్నలో జింక్ లోపం కనబడుతుంది. దీని వల్ల ఆకుల, ఈనె మధ్య భాగాలు పాలిపోయిన పసుపు, తెలుపు రంగుగా మారతాయి. పంట ఎదుగుదల ఆశించినంతగా ఉండదు. జింక్ లోపం నివారణకు లీటరు నీటికి 2 గ్రాముల జింక్ సల్ఫేట్‌ను కలిపి 4-5 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.


