News October 9, 2025
శ్రీశైలం అధికారులకు సీఎం ప్రశంస

రాష్ట్ర ప్రజలకు శ్రీ భ్రమరాంబ, మల్లికార్జున స్వామి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ నెల 16న PM మోదీ శ్రీశైలానికి రానుండటంతో సీఎం పేరుతో ఓ లెటర్ విడుదలైంది. శ్రీశైల దేవస్థానం ప్రతినిధులు ‘శ్రీశైల నూతన తామ్ర శాసనాలు’ అనే గ్రంధాన్ని ప్రచురించడం, ప్రధాని తిలకించేలా ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రదర్శన పెట్టడం అభినందనీయమని సీఎం కొనియాడారు.
Similar News
News October 9, 2025
జాన్సన్ & జాన్సన్‌కు రూ.8వేల కోట్ల జరిమానా!

ఫార్మా దిగ్గజం ‘జాన్సన్ & జాన్సన్’కు టాల్కమ్ పౌడర్ సంబంధిత కేసులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. పౌడర్ వాడిన 88ఏళ్ల మే మూర్ 2021లో మెసోథెలియోమా అనే అరుదైన క్యాన్సర్‌తో చనిపోయారు. బాధితురాలి కుటుంబీకులు USA కోర్టుని ఆశ్రయించగా సుదీర్ఘ విచారణ తర్వాత కంపెనీకి $966 మిలియన్ల (రూ. 8,000 కోట్లు) భారీ జరిమానా విధించింది. అయితే ఈ తీర్పుపై సంస్థ అప్పీల్‌కు వెళ్లనుంది. ఇప్పటికే సంస్థపై 63వేల కేసులు నమోదయ్యాయి.
News October 9, 2025
YCP హయాంలో ఉత్తరాంధ్రకు 4 మెడికల్ కాలేజీలు: జగన్

మాజీ సీఎం జగన్ నర్సీపట్నం మెడికల్ కాలేజీ ముందు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ.. 2019 వరకు ఉత్తరాంధ్రలో బ్రిటీష్ హయాంలో కట్టిన KGH, YSR హయాంలో తీసుకొచ్చిన రిమ్స్ మాత్రమే ఉండేవన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఉత్తరాంధ్రలో సుమారు 4 కాలేజీల ఏర్పాటుకు చర్యలు చేపట్టామన్నారు. ఇప్పటికే విజయనగరం, పాడేరు కాలేజీల్లో క్లాసులు కూడా స్టార్ట్ అయ్యాయన్నారు.
News October 9, 2025
BREAKING: అల్లూరి జేసీ బదిలీ

అల్లూరి సీతారామరాజు జిల్లా జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ్‌ను బదిలీ చేస్తూ చీఫ్ సెక్రటరీ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. పాడేరు ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీ పూజకి అల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. అభిషేక్ ఏలూరు జిల్లా జాయింట్ కలెక్టర్‌గా బదిలీ అయ్యారు.