News October 9, 2025
భారత్ నుంచి నోబెల్ అందుకున్నది వీరే..

<<17948949>>నోబెల్<<>> పురస్కారం అందుకున్న తొలి భారతీయుడిగా రవీంద్రనాథ్ ఠాగూర్(1913-సాహిత్యం) నిలిచారు. 1930లో సి.వి.రామన్(ఫిజిక్స్), 1979లో మదర్ థెరిసా(శాంతి), 1998లో అమర్త్యసేన్(అర్థశాస్త్రం), 2014లో కైలాశ్ సత్యార్థి(శాంతి) ఈ జాబితాలో ఉన్నారు. భారత సంతతి వారిలో హరగోవింద్ ఖొరానా(వైద్యశాస్త్రం), సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్(ఖగోళ భౌతిక), వెంకట్రామన్ రామకృష్ణన్(రసాయన), అభిజిత్ బెనర్జీ(అర్థశాస్త్రం) ఉన్నారు.
Similar News
News October 9, 2025
రేపు పిడుగులతో కూడిన భారీ వర్షాలు: APSDMA

AP: ద్రోణి ప్రభావంతో రేపు పలు జిల్లాల్లో వర్షాలు పడతాయని APSDMA అంచనా వేసింది. అల్లూరి, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. మిగతా జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది. ఇవాళ ఉత్తరాంధ్రతో పాటు రాయలసీమలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసిన విషయం తెలిసిందే.
News October 9, 2025
బొంతుకు బీజేపీ టికెట్ ఇవ్వాలి.. ప్రతిపాదించిన అర్వింద్

TG: జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థి ఎంపికపై కీలక పరిణామం చోటు చేసుకుంది. బొంతు రామ్మోహన్ పేరును ఎంపీ అర్వింద్ ప్రతిపాదించారు. బొంతును పార్టీలోకి తీసుకొని జూబ్లీహిల్స్ టికెట్ ఇవ్వాలని పార్టీ రాష్ట్రాధ్యక్షుడు రామ్‌చందర్ రావును కోరారు. ఆయనకు ABVP బ్యాగ్రౌండ్ ఉందని గుర్తు చేశారు. కాగా బొంతు కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడ్డారు. అక్కడ నవీన్ యాదవ్‌కు అధిష్ఠానం టికెట్ కేటాయించింది.
News October 9, 2025
రోల్డ్‌గోల్డ్ నగలు ఎక్కువకాలం మన్నాలంటే..

నగలంటే ప్రతి మహిళకూ ప్రత్యేకమే. కానీ రోజురోజుకూ పెరిగిపోతున్న బంగారం ధరలతో నగలు కొనడం కష్టమవుతోంది. దీంతో గిల్టు నగలు కొనడం ఎక్కువైంది. అయితే వీటిని సరిగ్గా సంరక్షించకపోతే త్వరగా పాడైపోతాయి. అందుకే వీటిని నీటికి దూరంగా ఉంచాలి. చర్మంపై మేకప్, మాయిశ్చరైజర్, పర్ఫ్యూమ్‌లు, లోషన్లు, డియోడరెంట్లు వాడే ముందు గిల్టు నగలను తీసేయాలి. వీటి కెమికల్స్ వల్ల వాటి కోటింగ్ పోతుంది. ఎయిర్‌టైట్ పౌచ్‌లో భద్రపరచాలి.