News October 9, 2025

నాగర్‌కర్నూల్‌ జిల్లాలో అత్యధిక వర్షపాతం అక్కడే!

image

గడచిన 24 గంటల్లో నాగర్‌కర్నూల్‌ జిల్లా వ్యాప్తంగా వర్షపాతం వివరాలను వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. జిల్లాలోనే అత్యధికంగా కోడేరు మండలంలో 32.5 మి.మీ. వర్షపాతం నమోదైంది. నాగర్‌కర్నూల్‌లో 21.2 మి.మీ., కల్వకుర్తిలో 14.0 మి.మీ., తిమ్మాజీపేటలో 12.3 మి.మీ., బల్మూరులో 11.3 మి.మీ., పెద్దకొత్తపల్లిలో 11.0 మి.మీ., తాడూరులో 6.4 మి.మీ. వర్షపాతం నమోదైనట్లు తెలిపారు.

Similar News

News October 9, 2025

వరంగల్: బాణసంచా విక్రయించేవారికి ALERT

image

వరంగల్ కమిషనరేట్ పరిధిలో దీపావళి సందర్భంగా బాణసంచా విక్రయించేవారు తప్పనిసరిగా టెంపరరీ లైసెన్స్ పొందాలని పోలీసు శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సంబంధిత జోనల్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (DCP) కార్యాలయంలో రూ.800 ఫీజు చెల్లించాలన్నారు. దీని కోసం ఫైర్ ఆఫీసర్ NOC, స్థల అనుమతి, షాప్ సైట్ ప్లాన్‌తో పాటు డాక్యుమెంట్లు సరిగా అందించాలన్నారు. ఈ నెల 16 వరకు మాత్రమే దరఖాస్తులు చేసుకోవాలన్నారు.

News October 9, 2025

VZM: ఈనెల 10, 11న ఎలక్ట్రానిక్స్ ఎగ్జిబిషన్-కమ్-సేల్

image

ఈనెల 10, 11న మహారాజా గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ మ్యూజిక్ అండ్ డాన్స్ ప్రాంగణంలో ఎలక్ట్రానిక్స్ ఎగ్జిబిషన్-కమ్-సేల్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ రాంసుందర్ రెడ్డి గురువారం తెలిపారు. వివిధ ఎలక్ట్రానిక్స్ డీలర్లు తమ తాజా గాడ్జెట్లు, గృహోపకరణాలు, స్మార్ట్ హోమ్ సొల్యూషన్స్, హెల్త్ డివైసెస్ ప్రదర్శనకు ఉంచనున్నారన్నారు. తగ్గిన పన్ను రేట్ల ప్రకారం తక్కువ ధరకే ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయని వివరించారు.

News October 9, 2025

SKLM: ‘ఫిర్యాదిదారులు సంతృప్తి చెందేలా సమస్యలు పరిష్కరించాలి’

image

ఫిర్యాదుదారులు రెవెన్యూ సమస్యలపై సంతృప్తి చెందేలా పరిష్కరించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో గురువారం ఆయనతో పాటు జాయింట్ కలెక్టర్ అహమ్మద్ ఫర్మాన్ ఖాన్ సమావేశం నిర్వహించారు. పీజీఆర్ఎస్, రెవెన్యూ సమస్యలు, మ్యూటేషన్, పౌరసరఫరాలు అంశాలపై పెండింగ్లో ఉన్న దరఖాస్తులు పరిష్కరించాలన్నారు. అధికారులు పాల్గొన్నారు.