News October 9, 2025

నాగర్‌కర్నూల్‌లో 6.47 లక్షల ఓటర్లు

image

నాగర్‌కర్నూల్‌ జిల్లాలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో 6,47,342 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. జిల్లాలో రెండు విడతలుగా ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇందుకోసం 1,228 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొదటి విడతలో 10 జడ్పీటీసీ, 115 ఎంపీటీసీ స్థానాలకు; రెండో విడతలో 10 జడ్పీటీసీ, 99 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది.

Similar News

News October 9, 2025

బీఆర్ఎస్ చేసిన చట్టం బీసీలకు ఉరితాడులా మారింది: భట్టి

image

TG: రాష్ట్రంలో రిజర్వేషన్లు 50శాతానికి మించకుండా 2018లో BRS చేసిన చట్టం ఇప్పుడు OBCలకు ఉరితాడులా మారిందని Dy.CM భట్టి విక్రమార్క మండిపడ్డారు. భవిష్యత్తులో ఇలాంటి దుష్టులు, దుర్మార్గులు అడ్డుకుంటారనే పక్కాగా కులగణన సర్వే చేశామన్నారు. బీసీలకు న్యాయం చేసేందుకు 42శాతం రిజర్వేషన్లు కల్పించాలని సంకల్పించినట్లు చెప్పారు. కానీ కోర్టులో కేసులు వేసి బీసీల నోటి కాడ ముద్దను లాక్కుంటున్నారు’ అని ఆరోపించారు.

News October 9, 2025

4.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణే లక్ష్యం: కలెక్టర్

image

ఈ ఖరీఫ్ సీజన్‌లో 4.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా పెట్టుకున్నట్లు కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి తెలిపారు. గురువారం కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా సేకరణ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. పంట కొనుగోళ్లకు అవసరమైన ఏర్పాట్లు వెంటనే పూర్తి చేయాలన్నారు. మండల, గ్రామ స్థాయి కమిటీలను తక్షణం ఏర్పాటు చేయాలన్నారు. RSK సిబ్బందికి మద్దతు ధర, ట్రక్ షీట్ విధానంపై శిక్షణలు పూర్తి చేయాలన్నారు.

News October 9, 2025

GNT: అక్రమ విద్యుత్ కనెక్షన్లకు అపరాధ రుసుం

image

నిబంధనలకు విరుద్ధంగా కరెంటు వినియోగిస్తున్న 53 కనెక్షన్లకు విద్యుత్ శాఖ అధికారులు గురువారం రూ. 4.86 లక్షల అపరాధ రుసుం విధించారు. విద్యుత్ శాఖలోని విజిలెన్స్, ఆపరేషన్స్ విభాగాలు సంయుక్తంగా గురువారం చమల్లమూడి, కాట్రపాడు, ముట్లూరు, పల్లాడు, సౌపాడు, వింజనంపాడు ప్రాంతాల్లో 1,965 సర్వీసులను తనిఖీ చేశాయి. ఈ తనిఖీల్లో నిబంధనలకు విరుద్ధంగా కరెంటు వాడుతున్న కనెక్షన్లను గుర్తించి, వాటికి జరిమానా విధించారు.