News October 9, 2025
మరోసారి మీటింగ్ పెడితే బాంబు పెడతా.. విజయ్‌కు బెదిరింపులు!

సినీ నటుడు, టీవీకే చీఫ్ విజయ్‌కి బాంబు బెదిరింపులు వచ్చాయి. డయల్ 100కు కాల్ చేసిన దుండగుడు ‘విజయ్ మరోసారి పబ్లిక్ మీటింగ్ నిర్వహిస్తే ఆయన ఇంట్లో బాంబు పెడతా’ అని హెచ్చరించినట్లు సమాచారం. దీంతో చెన్నైలోని విజయ్ ఇంటికి పోలీసులు భద్రత పెంచారు. నిందితుడి ఆచూకీ తెలుసుకునేందుకు లొకేషన్‌ను ట్రేస్ చేస్తున్నారు. ఇటీవల కరూర్‌లో విజయ్ పర్యటించగా జరిగిన తొక్కిసలాటలో 41 మంది చనిపోయిన విషయం తెలిసిందే.
Similar News
News October 9, 2025
బీఆర్ఎస్ చేసిన చట్టం బీసీలకు ఉరితాడులా మారింది: భట్టి

TG: రాష్ట్రంలో రిజర్వేషన్లు 50శాతానికి మించకుండా 2018లో BRS చేసిన చట్టం ఇప్పుడు OBCలకు ఉరితాడులా మారిందని Dy.CM భట్టి విక్రమార్క మండిపడ్డారు. భవిష్యత్తులో ఇలాంటి దుష్టులు, దుర్మార్గులు అడ్డుకుంటారనే పక్కాగా కులగణన సర్వే చేశామన్నారు. బీసీలకు న్యాయం చేసేందుకు 42శాతం రిజర్వేషన్లు కల్పించాలని సంకల్పించినట్లు చెప్పారు. కానీ కోర్టులో కేసులు వేసి బీసీల నోటి కాడ ముద్దను లాక్కుంటున్నారు’ అని ఆరోపించారు.
News October 9, 2025
వరిలో గింజ నాణ్యత పెరగడానికి ఇలా చేయండి

చిరుపొట్ట దశలో ఉన్న వరిలో గింజ నాణ్యత, బరువు పెరగడానికి, తెగుళ్లు, పురుగులను తట్టుకునే శక్తి పెంపొందించడానికి పలు చర్యలు తీసుకోవాలి. చివరి దఫాగా మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎకరాకు 20-25 కేజీల చొప్పున సిఫారసు చేసిన నత్రజని ఎరువును వేసుకోవాలని వరి శాస్త్రవేత్త గిరిజారాణి చెబుతున్నారు. ముదురు నారు వేసిన పొలాల్లో తప్పనిసరిగా సిఫారసు చేసిన ఎరువులను 25 శాతం పెంచి వేసుకోవాలని సూచిస్తున్నారు.
News October 9, 2025
రేపు పిడుగులతో కూడిన భారీ వర్షాలు: APSDMA

AP: ద్రోణి ప్రభావంతో రేపు పలు జిల్లాల్లో వర్షాలు పడతాయని APSDMA అంచనా వేసింది. అల్లూరి, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. మిగతా జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది. ఇవాళ ఉత్తరాంధ్రతో పాటు రాయలసీమలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసిన విషయం తెలిసిందే.