News October 9, 2025
విజయవాడలో నకలీ మద్యం విక్రయం..?

ములకలచెరువులో తయారైన నకిలీ మద్యాన్ని విజయవాడలోని పలు బార్లలో విక్రయించినట్లు ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. నిందితుడు జనార్ధనరావు భాగస్వామ్యంతో వైన్స్ మేనేజర్ కల్యాణ్ ఈ దందా నడిపినట్లు తేలింది. బెంగళూరు నుంచి ముడిసరుకు తెప్పించి, 4 నెలలుగా ఈ దందా సాగుతోంది.
Similar News
News October 9, 2025
ఆరోగ్య సేవల ఖర్చు తగ్గుతుంది: మంత్రి సవిత

గోరంట్ల ఏరియా హాస్పిటల్‌లో సూపర్ GST సూపర్ సేవింగ్స్ పై గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సవిత, కలెక్టర్ శ్యాం ప్రసాద్ పాల్గొన్నారు. వైద్య పరికరాలపై జీఎస్టీ రేట్లు గణనీయంగా తగ్గించడంపై ప్రజలకు, వైద్య సిబ్బందికి అవగాహన కల్పించారు. కేంద్ర ప్రభుత్వం వైద్య రంగంలో వినియోగించే పరికరాలపై జీఎస్టీని 18% నుంచి 5% తగ్గించడంతో ఆరోగ్య సేవల ఖర్చు తగ్గిందని మంత్రి తెలిపారు.
News October 9, 2025
TTDకి టోకరా వేయబోయి… చివరకు CBIకి చిక్కి

PMO Dy.Sec అంటూ మోసాలు చేస్తున్న వ్యక్తి తిరుమల బాలాజీ సాక్షిగా దొరికాడు. మే10న రామారావు అనే వ్యక్తి PMO అధికారినని 10 సుప్రభాత టికెట్లు, 3AC రూములు కావాలని TTD EOకు లేఖ ఇచ్చారు. అనుమానంతో అధికారులు PMOలో ఆరా తీయగా అలాంటి వ్యక్తి లేరని చెప్పారు. ఆపై PMO AD శర్మ CBIకి ఫిర్యాదు చేశారు. తాజాగా కేసు విచారణలో అతడు ఇదివరకూ పీఎంఓ JSనంటూ పుణే వర్సిటీలో అడ్మిషన్, మైసూరులో భూమి పత్రాలను పొందాడని తేలింది.
News October 9, 2025
అపోలో వర్సిటీ ఘటనపై కేసు నమోదు

చిత్తూరు అపోలో యూనివర్సిటీలోని <<17959171>>గర్ల్స్ టాయిలెట్‌లో<<>> హిడెన్ కెమెరా అమర్చిన నిందితుడిని పోలీసులు గుర్తించారు. చెన్నైకి చెందిన ఓ ప్రైవేట్ కన్స్ట్రక్షన్ కంపెనీలో సైట్ ఇంజినీరింగ్ పనిచేస్తున్న రూబెన్‌గా నిర్ధారించారు. ఈ మేరకు అతని నుంచి పోలీసులు ల్యాప్‌టాప్ స్వాధీనం చేసుకున్నారు. యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఫిర్యాదు మేరకు చిత్తూరు తాలూకా పోలీసులు కేసు నమోదు చేశారు.