News October 9, 2025

గుంటూరు: అక్రమాల అడ్డుకట్టకు టాస్క్ ఫోర్స్

image

గుంటూరు జిల్లాలో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు SP వకుల్ జిందాల్ ప్రత్యేక టాక్స్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. గంజాయి, పేకాటలపై ప్రత్యేక నిఘా కోసం గతంలో ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్ వంటి వర్గాల్లో అత్యధిక కాలం పని చేసి అసాంఘిక కార్యకలాపాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించడంలో అనుభవం ఉన్న సిబ్బందితో ఈ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. ఒక్కో సబ్ డివిజన్‌కు ఒకరు లేదా ఇద్దరు చొప్పున సిబ్బందిని నియమించారు

Similar News

News October 9, 2025

GNT: అక్రమ విద్యుత్ కనెక్షన్లకు అపరాధ రుసుం

image

నిబంధనలకు విరుద్ధంగా కరెంటు వినియోగిస్తున్న 53 కనెక్షన్లకు విద్యుత్ శాఖ అధికారులు గురువారం రూ. 4.86 లక్షల అపరాధ రుసుం విధించారు. విద్యుత్ శాఖలోని విజిలెన్స్, ఆపరేషన్స్ విభాగాలు సంయుక్తంగా గురువారం చమల్లమూడి, కాట్రపాడు, ముట్లూరు, పల్లాడు, సౌపాడు, వింజనంపాడు ప్రాంతాల్లో 1,965 సర్వీసులను తనిఖీ చేశాయి. ఈ తనిఖీల్లో నిబంధనలకు విరుద్ధంగా కరెంటు వాడుతున్న కనెక్షన్లను గుర్తించి, వాటికి జరిమానా విధించారు.

News October 9, 2025

పత్తి కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు చేయాలి: సీఎస్

image

రాష్ట్రంలో పత్తి కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు చేయాలని సీఎస్ విజయానంద్ అధికారులను ఆదేశించారు. నవంబర్ 1వ తేదీ నుంచి పత్తి దిగుబడులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో సీఎస్ గురువారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఖరీఫ్ ధాన్యం సేకరణకు ఇ-పంటలో నమోదు తప్పనిసరి అని స్పష్టం చేశారు. ధాన్యం, పత్తి కొనుగోళ్ల విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉండి, రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు.

News October 9, 2025

ధాన్యం కొనుగోళ్లలో దళారీ వ్యవస్థను కట్టడి చేయాలి: జేసీ

image

GNT జిల్లాలో ధాన్యం సేకరణపై నేడు కలెక్టరేట్‌లో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో JC ఆశుతోష్ శ్రీవాస్తవ మాట్లాడారు. ధాన్యం కొనుగోళ్లలో దళారీ వ్యవస్థను పూర్తిగా కట్టడి చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో 50 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణను లక్ష్యంగా నిర్దేశించినట్లు తెలిపారు. ధాన్యం కనీస మద్దతు ధరను సాధారణ రకం క్వింటాలుకు రూ. 2,369/గా, ‘A’ గ్రేడ్ రకం క్వింటాలుకు రూ. 2,389/గా నిర్ణయించామన్నారు.