News October 9, 2025
నిరుద్యోగులకు శుభవార్త.. గరిష్ఠ వయోపరిమితి పెంపు

AP: నాన్ యూనిఫామ్ సర్వీస్ ఉద్యోగాలకు పోటీ పడే అభ్యర్థుల గరిష్ఠ వయోపరిమితిని ప్రభుత్వం 34 నుంచి 42 ఏళ్లకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. యూనిఫామ్ పోస్టులకు మాత్రం రెండేళ్లు పొడిగించింది. 2026, సెప్టెంబర్ 30 వరకు ఈ వయో సడలింపు వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇక నుంచి APPSC, ఇతర రిక్రూట్‌మెంట్ సంస్థల ద్వారా చేపట్టే నియామకాల్లో ఈ వయోపరిమితి అమలవుతుందని తెలిపింది.
Similar News
News October 9, 2025
TTDకి టోకరా వేయబోయి… చివరకు CBIకి చిక్కి

PMO Dy.Sec అంటూ మోసాలు చేస్తున్న వ్యక్తి తిరుమల బాలాజీ సాక్షిగా దొరికాడు. మే10న రామారావు అనే వ్యక్తి PMO అధికారినని 10 సుప్రభాత టికెట్లు, 3AC రూములు కావాలని TTD EOకు లేఖ ఇచ్చారు. అనుమానంతో అధికారులు PMOలో ఆరా తీయగా అలాంటి వ్యక్తి లేరని చెప్పారు. ఆపై PMO AD శర్మ CBIకి ఫిర్యాదు చేశారు. తాజాగా కేసు విచారణలో అతడు ఇదివరకూ పీఎంఓ JSనంటూ పుణే వర్సిటీలో అడ్మిషన్, మైసూరులో భూమి పత్రాలను పొందాడని తేలింది.
News October 9, 2025
బీఆర్ఎస్ చేసిన చట్టం బీసీలకు ఉరితాడులా మారింది: భట్టి

TG: రాష్ట్రంలో రిజర్వేషన్లు 50శాతానికి మించకుండా 2018లో BRS చేసిన చట్టం ఇప్పుడు OBCలకు ఉరితాడులా మారిందని Dy.CM భట్టి విక్రమార్క మండిపడ్డారు. భవిష్యత్తులో ఇలాంటి దుష్టులు, దుర్మార్గులు అడ్డుకుంటారనే పక్కాగా కులగణన సర్వే చేశామన్నారు. బీసీలకు న్యాయం చేసేందుకు 42శాతం రిజర్వేషన్లు కల్పించాలని సంకల్పించినట్లు చెప్పారు. కానీ కోర్టులో కేసులు వేసి బీసీల నోటి కాడ ముద్దను లాక్కుంటున్నారు’ అని ఆరోపించారు.
News October 9, 2025
వరిలో గింజ నాణ్యత పెరగడానికి ఇలా చేయండి

చిరుపొట్ట దశలో ఉన్న వరిలో గింజ నాణ్యత, బరువు పెరగడానికి, తెగుళ్లు, పురుగులను తట్టుకునే శక్తి పెంపొందించడానికి పలు చర్యలు తీసుకోవాలి. చివరి దఫాగా మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎకరాకు 20-25 కేజీల చొప్పున సిఫారసు చేసిన నత్రజని ఎరువును వేసుకోవాలని వరి శాస్త్రవేత్త గిరిజారాణి చెబుతున్నారు. ముదురు నారు వేసిన పొలాల్లో తప్పనిసరిగా సిఫారసు చేసిన ఎరువులను 25 శాతం పెంచి వేసుకోవాలని సూచిస్తున్నారు.