News October 9, 2025

దుబాయ్‌లో మరణించిన సోంపేట మండల వాసి

image

సోంపేట మండలం పాలవలస గ్రామానికి చెందిన తామాడ ఓంకార్ (21) దుబాయ్‌లో అనుమానాస్పదంగా మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ప్రకారం.. 6 నెలలు క్రితం వలస కూలీగా దుబాయ్ వెళ్లిన ఓంకార్ ఈ నెల 3వ తేదీన మరణించినట్లు సహచర కార్మికులు ద్వారా తెలిసిందన్నారు. మృతదేహాన్ని గ్రామానికి రప్పించడానికి నాయకులు, అధికారులు సహకరించాలని కోరారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.

Similar News

News October 9, 2025

SKLM: ‘ఫిర్యాదిదారులు సంతృప్తి చెందేలా సమస్యలు పరిష్కరించాలి’

image

ఫిర్యాదుదారులు రెవెన్యూ సమస్యలపై సంతృప్తి చెందేలా పరిష్కరించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో గురువారం ఆయనతో పాటు జాయింట్ కలెక్టర్ అహమ్మద్ ఫర్మాన్ ఖాన్ సమావేశం నిర్వహించారు. పీజీఆర్ఎస్, రెవెన్యూ సమస్యలు, మ్యూటేషన్, పౌరసరఫరాలు అంశాలపై పెండింగ్లో ఉన్న దరఖాస్తులు పరిష్కరించాలన్నారు. అధికారులు పాల్గొన్నారు.

News October 9, 2025

SKLM: జీలుగ ఉత్పత్తులను సీఎంకు చూపించిన మంత్రి

image

రాష్ట్ర రాజధానిలో గురువారం సీఎం చంద్ర‌బాబుకి మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు జీలుగ ఉత్పత్తులను చూపించారు. గిరిజన ప్రాంతాల్లో తయారు చేసిన జీలుగు బెల్లాన్ని CM రుచి చూశారు. అరకు కాఫీ తరహాలోనే జీలుగు ఉత్పత్తులను ప్రోత్సహించాలని సీఎం ఆదేశించారు. అటవీ ప్రాంతంలో వెదురు ఉత్పత్తుల విషయంలో దృష్టి సారించాలని మంత్రి అచ్చెన్న కోరారు. ధరలు సూచించే వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు

News October 9, 2025

శ్రీకాకుళం: యూత్ వాలంటీర్‌గా అవకాశం.. నెలకు రూ.5000 స్టైఫండ్

image

నేషనల్ యూత్ వాలంటీర్లుగా పనిచేస్తూ నెలకు రూ.5000 స్టైఫండ్ సంపాదించే సువర్ణ అవకాశం ప్రభుత్వం కల్పిస్తున్నట్లు, మై భారత్ జిల్లా డిప్యూటీ డైరెక్టర్ వెంకట్ ఉజ్వల్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. సమాజ సేవ చేయాలనుకునే వారు 10వ తరగతి పాసై 29 ఏళ్ల లోపు అభ్యర్థులు https://nyks.nic.in/NationalCorps/nyc.html వెబ్సైట్లో అక్టోబర్ 15లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.