News October 9, 2025
శ్రీరామసాగర్ ప్రాజెక్టులో భారీ వరద ప్రవాహం

శ్రీరామసాగర్ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి భారీ వరద నీరు వచ్చి చేరింది. ప్రాజెక్టు నీటిమట్టం 80.053 టీఎంసీలకు చేరడంతో అధికారులు 16 గేట్లు ఎత్తి 59,774 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేశారు. దిగువ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
Similar News
News October 10, 2025
స.హ. చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలి: కలెక్టర్

సమాచార హక్కు చట్టాన్ని(ఆర్టీఐ) పకడ్బందీగా అమలు చేయాలని అధికారులను నిజామాబాద్ కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. ఆర్టీఐ చట్టం ప్రవేశపెట్టి 20 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా గురువారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో నిర్వహించిన కార్యక్రమాన్ని కలెక్టర్ నేతృత్వంలో జిల్లా అధికారులు కలెక్టరేట్‌లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. అనంతరం చట్టం అమలుకై అధికారులచే ప్రమాణం చేయించారు.
News October 9, 2025
మోస్రా: నామినేషన్ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలి: కలెక్టర్

మోస్రాలోని మండల కాంప్లెక్స్ భవనంలో ఏర్పాటు చేసిన స్థానిక సంస్థల ఎన్నికల నియమావళిని కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి గురువారం పరిశీలించారు. నామినేషన్‌లకు సంబంధించిన ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ రాజశేఖర్, ఎంపీడీఓ శ్రీనివాస్, ఎలక్షన్ అధికారులు రతన్, రవీందర్, అంబర్ సింగ్ పాల్గొన్నారు.
News October 9, 2025
ధర్పల్లి: బడికి ఫోన్ తీసుకెళ్లాడని విద్యార్థికి TC

పాఠశాలకు సెల్ ఫోన్ తీసుకెళ్లాడని ఓ విద్యార్థికి TC ఇచ్చిన ఘటన ధర్పల్లి(M) దుబ్బాక ప్రభుత్వ పాఠశాలలో జరిగింది. 8వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థి పాఠశాలలో బతుకమ్మ ఆడే సమయంలో సెల్ ఫోన్‌లో ఫొటోలు తీశాడు. దీంతో HM శశికళ విద్యార్థిపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అనంతరం ఈనెల 8న విద్యార్థికి TC ఇచ్చింది. పాఠశాలలో చేర్చుకోవాలని తండావాసులు గురువారం పాఠశాల ఎదుట నిరసన వ్యక్తం చేశారు.