News October 9, 2025

నాయుడుపేటలో ట్రైన్ కింద పడి ఇంటర్ విద్యార్థి మృతి

image

నాయుడుపేట రైల్వే స్టేషన్ వద్ద ఇంటర్ చదువుతున్న సంతోష్(17) ప్రమాదవశాత్తు ట్రైన్ కింద పడి మృతి చెందాడు. వరదయ్యపాలెంకు చెందిన సంతోష్ వెంకటాచలం వద్ద ఓ ప్రైవేట్ కాలేజీలో ఎంపీసీ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. దసరా సెలవులు ముగించుకొని తడ నుంచి వెంకటాచలానికి ఫ్రెండ్స్‌తో ట్రైన్‌లో బయలుదేరాడు. నాయుడుపేట వద్దకి వచ్చేసరికి అదుపుతప్పి ట్రైన్ కిందపడి మృతి చెందాడు.

Similar News

News October 9, 2025

CM నెల్లూరు జిల్లా పర్యటన ఖరారు

image

సీఎం చంద్రబాబు నెల్లూరు జిల్లా పర్యటన ఖరారు అయింది. శుక్రవారం మ. 2.25 గంటలకు ఆయన కోవూరు(M) పోతిరెడ్డిపాలెంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గానా మైపాడు గేట్ సమీపంలో ఏర్పాటు చేసిన స్మార్ట్ స్ట్రీట్‌ను ప్రారంభిస్తారు. షాపు ఓనర్లతో ఫొటోషూట్ అనంతరం 3.05 నిముషాలకు తిరిగి పోతిరెడ్డి పాలెం హెలిప్యాడ్ వద్దకు చేరుకుని అక్కడి నుంచి ఈదగాలి వెళ్తారు.

News October 9, 2025

ఇండస్ట్రియల్‌ హబ్‌గా కరేడు: కలెక్టర్ హిమాన్షు

image

పోర్టు ఆధారిత పరిశ్రమల రాకతో కరేడు గ్రామ రూపురేఖలు పూర్తిగా మారిపోతున్నాయని కలెక్టర్ హిమాన్షు శుక్ల అన్నారు. ఇండస్ట్రియల్‌ హబ్‌ ఏర్పాటుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టిపెట్టినట్లు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన భూసేకరణ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. మొత్తం 4,800 ఎకరాల భూసేకరణ అవసరం కాగా ఇప్పటివరకు 515 ఎకరాలకు సంబంధించి రైతులకు అవార్డు పాస్‌ చేసినట్లు ఆయన స్పష్టం చేశారు.

News October 9, 2025

రేపటి నుంచి నిలిచిపోనున్న NTR వైద్య సేవలు

image

నెల్లూరు జిల్లాలోని 35 నెట్‌వర్క్ హాస్పిటళ్లలో శుక్రవారం నుంచి NTR ఆరోగ్యశ్రీ వైద్య సేవలు నిలిచిపోనున్నట్లు సమాచారం. ప్రభుత్వం బకాయలు విడుదల చేయకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో గతేడాది ప్రైవేట్ నెట్వర్క్ హాస్పిటళ్లలో 6,1765 మంది సేవలను వినియోగించుకోగా రూ.68.23 కోట్ల మేర ఖర్చు అయింది. పూర్తి స్థాయిలో ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదని ఆస్పత్రి వక్గాలు వెల్లడిస్తున్నాయి.