News October 9, 2025
సిద్దిపేట: కొండెక్కిన కొబ్బరికాయ ధర!

కొబ్బరికాయల ధర కొండెక్కి కూర్చొంది. చిన్న కాయ అయినప్పటికీ ఎన్నడూ లేని విధంగా ధర పలుకుతోంది. దీంతో కొబ్బరి కాయలను కొనాలంటేనే వినియోగదారులు ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. సిద్దిపేట మార్కెట్లో చిన్న సైజ్ కొబ్బరికాయ ధర రూ.35 కాగా.. ఒక మోస్తరు సైజ్ కొబ్బరి ధర రూ.45 నుంచి రూ.50 వరకు పలుకుతోంది. ధర మునుపెన్నడు లేని విధంగా అమాంతంగా పెరగడంతో వినియోగదారులు అవసరమైతే తప్ప కొనడం లేదు.
Similar News
News October 9, 2025
త్రిమూర్తులుగా అవతరించిన నారాయణుడు

సృష్టి ఆరంభంలో నారాయణుడు ఒక్కడే స్వయం ప్రకాశంగా ఉండి.. సత్వ, రజో, తమో గుణాల భేదాల కారణంగా మూడు రూపాలు ధరించాడు. రజో గుణంతో సృష్టికర్తయైన బ్రహ్మగా, తమో గుణంతో లయకారుడైన శివుడిగా, సత్వ గుణంతో పాలకుడైన విష్ణువుగా అవతరించాడు. ఆ విష్ణువే సర్వాతీతుడు కాబట్టి ఆయన్నే మహేశ్వరుడు అని కీర్తించారు. ఈ సృష్టిలోని సర్వ దేవతా శక్తులన్నీ మూలపురుషుడైన నారాయణుడి ఏకత్వంలో నుంచే ఉద్భవించాయి. <<-se>>#WhoIsGod<<>>
News October 9, 2025
HYD, మేడ్చల్ జిల్లాలో రాత్రి వర్షం కురిసే ఛాన్స్

హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో రాత్రి అక్కడక్కడా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. గ్రేటర్ పరిధిలోనూ దీని ప్రభావం ఉండే అవకాశం ఉన్నట్లుగా అంచనా వేసింది. వాతావరణంలో తేమ శాతం పెరిగిందని, అంతేకాక.. ఉష్ణోగ్రతలు సైతం పెరగటం ఇందుకు సూచికగా వివరించింది.
News October 9, 2025
పాలమూరు: ‘ఎన్.ఎస్.ఎస్ వాలంటీర్లు సమాజ సేవకు అంకితం అవ్వాలి’

ఎన్.ఎస్.ఎస్ వాలంటీర్లు సమాజ సేవకు అంకితం అవ్వాలని పాలమూరు యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ ప్రవీణ అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని సెంట్రల్ లైబ్రరీలో ఏడు రోజుల క్యాంపును నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు మూఢనమ్మకాలు, బాల్య వివాహాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ప్రస్తుత సమాజంలో జరుగుతున్న సైబర్ నేరాలపై కూడా అవగాహన కల్పించాలని కోరారు.