News October 9, 2025
TRP ఉమ్మడి వరంగల్ జిల్లా కన్వీనర్‌గా రమణ

తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి 10 జిల్లాలకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ (TRP) సోషల్ మీడియా విభాగానికి కన్వీనర్లను నియమించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా కన్వీనర్‌గా భద్రకాళి రమణను ఎన్నుకున్నారు. ఈ మేరకు ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న, రాష్ట్ర కన్వీనర్ ఆకుల మనోజ్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నియామకం తక్షణమే అమలులోకి వస్తుందన్నారు.
Similar News
News October 9, 2025
ఓయూ LLM పరీక్షా తేదీల ఖరారు

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని LLM పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ తెలిపారు. LLM 2, నాలుగో సెమిస్టర్ రెగ్యులర్, అన్ని సెమిస్టర్ల బ్యాక్ లాగ్ పరీక్షలను ఈ నెల 13వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు చెప్పారు. పరీక్షా తేదీల పూర్తి వివరాలను ఓయూ వెబ్‌సైట్ www.osmania.ac.inలో చూసుకోవచ్చని సూచించారు.
News October 9, 2025
తొర్రూరు డిపోకు భారీ ఆదాయం

బతుకమ్మ, దసరా పండగల సందర్భంగా రద్దీకి అనుగుణంగా బస్సులు నడపడంతో ఆర్టీసీకి మంచి ఆదాయం సమకూరింది. 494 ట్రిప్పులు, 2,30,384 కిలోమీటర్లు, 2,06,138 మంది ప్రయాణికులను చేరవేసి ఏకంగా ₹1,70,67,162 ఆదాయాన్ని తొర్రూరు డిపో పొందింది. RTC సంస్థ అభివృద్ధికి డ్రైవర్లు, కండక్టర్లు, సిబ్బంది అందరూ కృషి చేశారని తొర్రూర్ డీఎం శ్రీదేవీ తెలిపారు.
News October 9, 2025
ములుగు: పోక్సో కేసులో ఒకరికి జీవిత ఖైదు

పొక్సో కేసులో ఒకరికి జీవిత కైదు విధించినట్లు ములుగు ఎస్పీ శబరీశ్ తెలిపారు. ఎస్పీ తెలిపిన వివరాలు.. ఏటూరునాగారానికి చెందిన నిందితుడు మంతెన రామయ్యపై నమోదు చేసిన పొక్సో కేసు నేరం నిరూపితమైంది. ఈ మేరకు కోర్టు జీవిత ఖైదు, 20 ఏళ్ల కఠిన కారాగార జైలు శిక్షతోపాటు రూ.12 వేల జరిమానా విధించింది. అదే విధంగా బాధితురాలికి రూ.10 లక్షల నష్టపరిహారం అందించాలని కోర్టు తీర్పు ఇచ్చినట్లు ఎస్పీ పేర్కొన్నారు.