News October 9, 2025
కాకినాడ: పవన్ కళ్యాణ్ స్టైలిష్ లుక్.. ఫొటోలు వైరల్

ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చాలా రోజుల తర్వాత అధికారిక కార్యక్రమంలో క్యాజువల్ లుక్‌లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. సాధారణంగా తెల్లటి దుస్తుల్లో కనిపించే పవన్ గురువారం కాకినాడ పర్యటన సందర్భంగా క్యాజువల్ దుస్తులు, గాగుల్స్ ధరించారు. రియల్ లైఫ్‌లోనూ స్టైలిష్‌గా ఉన్న ఆయన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Similar News
News October 9, 2025
పిట్లం: అదృష్టం బాగుంది… ప్రాణాలు సేఫ్!

పిట్లం వద్ద హైవే పై అండర్ పాస్ బ్రిడ్జిపై గురువారం ప్రమాదం జరిగింది. HYD నుంచి నాందేడ్ వైపు వెళ్తున్న లారీని, అదే రూట్‌లో వెనుక వస్తున్న కారు ఢీకొని ఇరుక్కుపోయింది. లారీ ఆ కారును సుమారు 200 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లింది. మహారాష్ట్రలోని పర్భణికి చెందిన ఇద్దరు కారులో ప్రయాణిస్తున్నారు. కారులోని ఎయిర్‌బెలూన్స్ తెరచుకోవడం వల్ల వారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు.
News October 9, 2025
కృష్ణా: ఉపాధ్యాయుల పోరుబాట.. రేపటి నుంచి బోధనేతర యాప్‌ల బహిష్కరణ

బోధనేతర పనులపై ఆగ్రహంతో ఉన్న ప్రభుత్వ ఉపాధ్యాయులు పోరుబాటకు సిద్ధమయ్యారు. బోధనేతర అంశాలకు సంబంధించిన యాప్ లను శుక్రవారం నుండి బహిష్కరిస్తున్నట్టు ఫ్యాప్టో ప్రకటించింది. సంఘ పిలుపు మేరకు గురువారం కలెక్టరేట్, జిల్లా విద్యాశాఖాధి ఆఫీసుల్లో వినతిపత్రాలు అందజేశారు. విద్యార్థుల హాజరు, మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన పనులు మాత్రమే చేస్తామని ఫ్యాప్టో జిల్లా ఛైర్మన్ అంబటిపూడి సుబ్రహ్మణ్యం తెలిపారు.
News October 9, 2025
ఆసిఫాబాద్‌లో ఈ నెల 13 నుంచి సదరం శిబిరం

ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో అక్టోబర్ 13 నుంచి సదరం శిబిరాలు ప్రారంభమవుతాయని DRDA దత్తారాం గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 13న మానసిక వైకల్యం లోపం ఉన్నవారు. 14న మూగ, చెవిటి, 17న ఎముకలు, 21న రక్తస్రావ రుగ్మతకు సంబంధించి 28న కంటి లోపం ఉన్నవారు శిబిరంలో పాల్గొనాలని తెలిపారు.వైద్యులు పరీక్షించి వికలత్వ శాతాన్ని నిర్ధారించిన తర్వాత సదరం ధ్రువపత్రం అందజేయనున్నట్లు తెలిపారు.