News October 9, 2025

నర్మేట: పురుగు మందు తాగి వివాహిత ఆత్మహత్య

image

నర్మేట మండలం గండిరామవరం గ్రామానికి చెందిన వివాహిత పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. గ్రామస్థుల వివరాల ప్రకారం.. ముక్కెర లావణ్య(30) గురువారం ఉదయం ఇంట్లో పురుగు మందు తాగింది. గుర్తించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా మార్గమధ్యలో మృతి చెందింది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. మృతిరాలికి ఇద్దరు కుమారులు ఉన్నారు.

Similar News

News October 9, 2025

ఓయూ LLM పరీక్షా తేదీల ఖరారు

image

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని LLM పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ తెలిపారు. LLM 2, నాలుగో సెమిస్టర్ రెగ్యులర్, అన్ని సెమిస్టర్ల బ్యాక్ లాగ్ పరీక్షలను ఈ నెల 13వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు చెప్పారు. పరీక్షా తేదీల పూర్తి వివరాలను ఓయూ వెబ్‌సైట్ www.osmania.ac.inలో చూసుకోవచ్చని సూచించారు.

News October 9, 2025

తొర్రూరు డిపోకు భారీ ఆదాయం

image

బతుకమ్మ, దసరా పండగల సందర్భంగా రద్దీకి అనుగుణంగా బస్సులు నడపడంతో ఆర్టీసీకి మంచి ఆదాయం సమకూరింది. 494 ట్రిప్పులు, 2,30,384 కిలోమీటర్లు, 2,06,138 మంది ప్రయాణికులను చేరవేసి ఏకంగా ₹1,70,67,162 ఆదాయాన్ని తొర్రూరు డిపో పొందింది. RTC సంస్థ అభివృద్ధికి డ్రైవర్లు, కండక్టర్లు, సిబ్బంది అందరూ కృషి చేశారని తొర్రూర్ డీఎం శ్రీదేవీ తెలిపారు.

News October 9, 2025

ములుగు: పోక్సో కేసులో ఒకరికి జీవిత ఖైదు

image

పొక్సో కేసులో ఒకరికి జీవిత కైదు విధించినట్లు ములుగు ఎస్పీ శబరీశ్ తెలిపారు. ఎస్పీ తెలిపిన వివరాలు.. ఏటూరునాగారానికి చెందిన నిందితుడు మంతెన రామయ్యపై నమోదు చేసిన పొక్సో కేసు నేరం నిరూపితమైంది. ఈ మేరకు కోర్టు జీవిత ఖైదు, 20 ఏళ్ల కఠిన కారాగార జైలు శిక్షతోపాటు రూ.12 వేల జరిమానా విధించింది. అదే విధంగా బాధితురాలికి రూ.10 లక్షల నష్టపరిహారం అందించాలని కోర్టు తీర్పు ఇచ్చినట్లు ఎస్పీ పేర్కొన్నారు.