News October 9, 2025
ప్రేమ భద్రంగా ఉండేందుకు తాళం వేసేవారు!

పారిస్‌లోని పాంట్ డెస్ ఆర్ట్స్ బ్రిడ్జిపై ప్రేమకు చిహ్నంగా తాళాలు వేసే సంప్రదాయం (గుళ్లలో ముడుపుల మాదిరిగా) ఉండేది. తమ ప్రేమ శాశ్వతం కావాలని కోరుకునే జంటలు ఇక్కడ లాక్ చేసి, కీలను సీన్ నదిలో పడేసేవారు. అయితే తాళాల బరువుతో వంతెన కూలిపోయే ప్రమాదం ఉందని పారిస్ ప్రభుత్వం అలర్ట్ అయింది. 2015లో తాళాలను తొలగించి, వాటి స్థానంలో గాజు ప్యానెళ్లను అమర్చింది. ప్రస్తుతం ఇక్కడ తాళాలు వేయడం పూర్తిగా నిషేధం.
Similar News
News October 9, 2025
త్రిమూర్తులుగా అవతరించిన నారాయణుడు

సృష్టి ఆరంభంలో నారాయణుడు ఒక్కడే స్వయం ప్రకాశంగా ఉండి.. సత్వ, రజో, తమో గుణాల భేదాల కారణంగా మూడు రూపాలు ధరించాడు. రజో గుణంతో సృష్టికర్తయైన బ్రహ్మగా, తమో గుణంతో లయకారుడైన శివుడిగా, సత్వ గుణంతో పాలకుడైన విష్ణువుగా అవతరించాడు. ఆ విష్ణువే సర్వాతీతుడు కాబట్టి ఆయన్నే మహేశ్వరుడు అని కీర్తించారు. ఈ సృష్టిలోని సర్వ దేవతా శక్తులన్నీ మూలపురుషుడైన నారాయణుడి ఏకత్వంలో నుంచే ఉద్భవించాయి. <<-se>>#WhoIsGod<<>>
News October 9, 2025
డీఎస్సీకి అభ్యర్థులు సన్నద్ధం కావాలి: లోకేశ్

AP: DSC, స్పెషల్ DSCలకు అభ్యర్థులు సన్నద్ధం కావాలని మంత్రి లోకేశ్ పిలుపునిచ్చారు. NOV చివరి వారంలో టెట్, 2026 JANలో DSC నోటిఫికేషన్, MARలో పరీక్షలు నిర్వహించి టీచర్ పోస్టులను భర్తీ చేయాలని అధికారులను ఆదేశించారు. పాఠశాల విద్య, ఇంటర్మీడియట్, కళాశాల విద్య ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. కొత్త డీఎస్సీ తర్వాత వచ్చే విద్యాసంవత్సరం నాటికి ఉపాధ్యాయులు విధుల్లో చేరేలా ప్రణాళిక అమలు చేయాలన్నారు.
News October 9, 2025
బేసిక్ పోలీసింగ్ మర్చిపోయారు: డీజీపీ

TG: రాష్ట్రంలో పోలీసులు ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో బేసిక్ పోలీసింగ్‌ను మర్చిపోయారని DGP శివధర్ వ్యాఖ్యానించారు. ‘ఇకపై రెండూ ఉండాలి. వాహనాల చెకింగ్, కమ్యూనిటీ పోలీసింగ్‌తో పాటు ఇంటెలిజెన్స్ సేకరణకు ప్రాధాన్యమివ్వాలి. కిందిస్థాయి నుంచే ఇంటెలిజెన్స్ సేకరించాలి. శాంతిభద్రతల విషయంలో నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. పోలీసులకు పార్టీలతో సంబంధం లేదు. ప్రజల రక్షణే ధ్యేయం’ అని SPలు, కమిషనర్ల సమావేశంలో మాట్లాడారు.