News October 9, 2025

రూ.12,50,000 ప్రశ్న.. జవాబు చెప్పండి!

image

కౌన్ బనేగా కరోడ్‌పతి ప్రోగ్రామ్‌లో హోస్ట్ అమితాబ్ బచ్చన్ రూ.12.50 లక్షలకు క్రికెట్‌కు సంబంధించిన ప్రశ్న అడిగారు.
Q: ఈ కింది క్రికెటర్లలో వన్డేల్లో 10వేలకు పైగా పరుగులు చేసినా టెస్టుల్లో చేయనిది ఎవరు?
A: జో రూట్ B: విరాట్ కోహ్లీ
C: స్టీవ్ స్మిత్ D: కేన్ విలియమ్సన్
> మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి.

Similar News

News October 9, 2025

జనవరిలో డీఎస్సీ నోటిఫికేషన్!

image

AP: వచ్చే జనవరిలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తెలిపారు. నవంబర్ చివర్లో టెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని వెల్లడించారు. ఏటా డీఎస్సీ నిర్వహిస్తామనే మాటకు కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేశారు. మార్చిలో డీఎస్సీ, స్పెషల్ డీఎస్సీ పరీక్షలు నిర్వహించనున్నట్లు చెప్పారు. అభ్యర్థులు తమ చదువును కంటిన్యూ చేస్తే తప్పకుండా విజయం సాధించవచ్చు.

News October 9, 2025

బీజేపీ అంతర్గత చర్చకు నాకు సంబంధం లేదు: బొంతు

image

TG: తనను బీజేపీ అభ్యర్థిగా <<17960394>>ప్రతిపాదించిన<<>> విషయంపై పీసీసీ ఉపాధ్యక్షుడు బొంతు రామ్మోహన్ స్పందించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ నుంచి పోటీ చేస్తానన్న మాటల్లో వాస్తవం లేదన్నారు. తన అభ్యర్థిత్వంపై కాషాయ పార్టీలో అంతర్గత చర్చకు తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ‘నేను కాంగ్రెస్‌లోనే ఉన్నా.. ఉంటాను కూడా. ఇక్కడ సంతృప్తిగా ఉన్నాను’ అని ప్రకటన విడుదల చేశారు.

News October 9, 2025

APPSC పరీక్షల ఫలితాలు విడుదల

image

AP: వివిధ డిపార్టుమెంటు పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్ష ఫలితాలను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. ఆయా పోస్టులకు ఎంపికైన వారి జాబితాలను కమిషన్ వెబ్సైట్లో పొందుపరిచింది. అసిస్టెంటు ట్రైబల్ ఆఫీసర్, అసిస్టెంటు కెమిస్ట్ (గ్రౌండ్ వాటర్), లైబ్రేరియన్స్ (మెడికల్), ఫిషరీస్ డెవలప్మెంటు ఆఫీసర్ (ఫిషరీస్) పోస్టులకు ఎంపికైన వారి వివరాలను వెల్లడించింది. ఆ వివరాలను ఇక్కడ <>క్లిక్<<>> చేసి చూడవచ్చు.