News October 9, 2025

HYD: మేడిపల్లిలో భూలోక వైకుంఠం

image

శ్మశానం. ఆ పేరు వినగానే ఒళ్లు గగుర్పొడుస్తుంది. కాలుతున్న శవాల కమరు వాసనతో భీతి గొలిపే వాతావరణం కనిపిస్తుంది. ఎటుచూసినా ముండ్ల పొదలు, సమాధులు, చెత్త, చీకటి, అస్తవ్యస్త మార్గంతో జనం వెనుకడుగేస్తారు. దీనికి భిన్నంగా HYD శివారు మేడిపల్లి శ్మశానానికి హైటెక్ సొబగులు అద్దారు. పచ్చిక బయళ్లు, ప్రకాశవంతమైన కాంతులతో మెరిసిపోతోంది. ఆప్తులను కోల్పోయిన వారి దుఃఖాన్ని దూరం చేస్తోంది. వారికి సాంత్వననిస్తోంది.

Similar News

News October 9, 2025

శ్రీ సత్యసాయి జిల్లా నూతన జాయింట్ కలెక్టర్‌గా మౌర్య భరద్వాజ్

image

శ్రీ సత్యసాయి జిల్లా నూతన జాయింట్ కలెక్టర్‌గా మంత్రి మౌర్య భరద్వాజ్‌ను నియమిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులను జారీ చేసింది. ఈయన గతంలో కర్నూలు జిల్లా ఆదోని సబ్ కలెక్టర్‌గా విధులు నిర్వర్తించారు. ప్రస్తుతం జాయింట్ కలెక్టర్‌గా ఉన్న అభిషేక్ కుమార్ బదిలీ అవ్వడంతో మౌర్య భరద్వాజ్‌ను ప్రభుత్వం నియమించింది. త్వరలోనే మౌర్య బాధ్యతలు చేపట్టనున్నట్లు కలెక్టర్ కార్యాలయ సిబ్బంది తెలిపారు.

News October 9, 2025

NTR: ‘VRAల సమస్యలు తక్షణమే పరిష్కరించండి’

image

VRAల సమస్యల పరిష్కారానికి జిల్లా సహాధ్యక్షుడు మధుబాబు, ట్రెజరర్ పరదేశీ గురువారం కలెక్టర్ లక్ష్మీశాకు వినతిపత్రం అందజేశారు. అర్హులైన VRAలకు సీనియారిటీ జాబితా ప్రకటించి అటెండర్, వాచ్మెన్, డ్రైవర్లు, రికార్డు అసిస్టెంట్ ప్రమోషన్లు కల్పించాలని కోరారు. రూ.10,500 జీతంతో కుటుంబ పోషణ భారంగా ఉండటం, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో సహకారం అందిస్తున్నామని తెలిపారు.

News October 9, 2025

సానుకూల దృక్ఫ‌థంతో వ్య‌వ‌హ‌రించాలి: DRO

image

అర్జీదారుల సమస్యలను సానుకూల దృష్టితో పరిష్కరించాలని DRO శ్రీనివాసమూర్తి సూచించారు. క‌లెక్ట‌రేట్ ఆడిటోరియంలో గురువారం నిర్వ‌హించిన స‌మావేశంలో ఆయ‌న మాట్లాడారు. పెండింగ్ మ్యుటేషన్లను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. సమస్యలు పరిష్కారం కాని సందర్భాల్లో నిబంధనలను వివరించి, నోటీసుపై సంతకం తీసుకోవాలన్నారు. రెవెన్యూ అధికారులు అర్జీదారుల సంతృప్తికి ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు.